Home Latest News ఏపీ సీఎం జ‌గ‌నే.. నా మ‌ద్ద‌తు ఆయ‌న‌కే : ర‌మ‌ణ దీక్షితులు

ఏపీ సీఎం జ‌గ‌నే.. నా మ‌ద్ద‌తు ఆయ‌న‌కే : ర‌మ‌ణ దీక్షితులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విడుద‌ల చేసిన మేనిఫెస్టో చూసిన త‌రువాత ఏపీలోని దేవాల‌యాల అర్చ‌కులు, బ్రాహ్మ‌ణులు అంద‌రూ కూడా చాలా సంతోష‌ప‌డ్డార‌ని టీటీడీ పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను ఆయ‌న విడుద‌ల చేశారు.

2007లో దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అర్చ‌కుల కోసం చేసిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణలో భాగంగా వంశ‌పార‌ప‌ర్య హ‌క్కులు, ఇత‌ర మ‌ర్యాద‌ల‌ను అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌న్నారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు నిధి స‌మకూరుస్తామ‌ని కూడా జ‌గన్ వైసీపీ మేనిఫెస్టోలో పొందుప‌రిచార‌న్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌డం అనేది ఒక అపూర్వ‌మైన విష‌యమ‌ని ర‌మ‌ణ దీక్షితులు పేర్కొన్నారు.

రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో స‌న్నిహితంగా ఉన్న కాలంలో నేను గ‌మ‌నించంది వారికి శ్రీ వారి మీద, దేవాల‌యాలు, బ్రాహ్ములు, అర్చ‌కుల మీద అత్యంత భ‌క్తి భావం ఉంద‌ని. వైఎస్ఆర్‌కు ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డాల‌నే ఒక త‌ప‌న ఉండేది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి అత్య‌ధిక సార్లు వ‌చ్చిన వారిలో వైఎస్ఆర్ ఒక‌రు. వ‌చ్చిన ప్ర‌తి సారి కూడా ఆయ‌న ఎంతో సుచిగా, భ‌క్త‌గా వ‌చ్చారు.

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కూడా తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు పాద ర‌క్ష‌లు లేకుండా అలిపిరి మార్గం గుండా పాద‌యాత్ర‌గా గోవింద నామ స్మ‌ర‌ణ‌తో వారి అనుచుల‌తో క‌లిసి ఎంతో భ‌క్తిగా తిరుమ‌ల‌కు చేరుకుని స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకున్నార‌న్నారు. మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తుల‌న్నా వైఎస్ జ‌గ‌న్‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad