ఇక ప్రతీ ఏడాది అక్టోబర్ 15 రైతన్న కళ్లల్లో కొత్తకాంతి కనిపించబోతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అదేరోజున రాష్ట్రమంతా ఒకేరోజు చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ రోజు ప్రతి రైతు కుటుంబానికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడి రాయితీ, పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాలు పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.