ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిలెగల రాంపుల్లారెడ్డి కాసేపటి క్రితమే ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాగా, ఇరిగెల రాంపుల్లారెడ్డి ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలోగల లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన వీరి భేటీ అనంతరం రాంపుల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులను వైఎస్ జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. పార్టీ టికెట్ ఎవ్వరికిచ్చినా ఆళ్లగడ్డ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆళ్లగడ్డలో తనకూ, వైసీపీ నేతలకు ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని, ఒకవేళ ఉన్నా వాటన్నిటిని జగన్ మోహన్‌రెడ్డి చూసుకుంటారన్నారు.