Home General అమెరికాలో మరో భారతీయుడి అరెస్ట్‌.. మరో సీక్రెట్ ఆపరేషన్..!

అమెరికాలో మరో భారతీయుడి అరెస్ట్‌.. మరో సీక్రెట్ ఆపరేషన్..!

ఈమద్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలమేరకు సీక్రెట్ ఆపరేషన్ పేరుతో ఒక ఫెక్ యునివర్సిటీ స్థాపించి, దానిద్వారా స్టూడెంట్ వీసా పేరుతో చట్ట విరుద్దంగా అమెరికా వచ్చే వారిని వలవేసి మరీ పట్టుకుంది అమెరికా ప్రభుత్వం. దాంతో ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి… వారిలో మన తెలుగు విద్యార్థులు కూడా ఉన్నవిషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ మరవకముందే అమెరికా పోలీసులు మరో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మరో భారతీయుడిని అరెస్ట్ చేయడం కలకలం సృస్టిస్తుంది.

ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు ? అతడు చేసిన నేరం ఏంటి ? అనే విషయానికి వస్తే.. అమెరికాలో సెటిల్ అయిన నర్సన్‌ లింగాల (55) అనే వ్యక్తి తన భార్య నుండి విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు.. కారణం అతడికి సంధ్యారెడ్డి (52) అనే మరో ప్రియురాలు ఉండడమే. కానీ అది సాధ్యం కాలేదు.. పైగా అమెనుండి ఒత్తిడి ఎక్కువైది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్‌ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018, జూన్‌ లో ఓ కేసు విచారణ సందర్భంగా “నా భార్యను చంపాలి… నీకు ఎవరైనా కిరాయి హంతకుడు తెలుసా ?” అని తన సహచర ఖైదీని అడిగాడు నర్సన్‌… అది విని ముందు సరే అని చెప్పినా ఆ వ్యక్తి, ఆ విషయాన్ని కాస్త జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు.

దాంతో గతేడాది ఆగస్ట్‌ లో కిరాయి హంతకుడిలా వచ్చిన ఓ పోలీస్‌ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో నర్సన్,  సంధ్య కలిశారు. “నా జీవితం నా మాజీ భార్య ఉండకూడదు శాశ్వతంగా వెళ్లిపోవాలి” అంటూ సుపారి ఇచ్చాడు. వెంటనే భార్య పూర్తి వివరాలు ఇచ్చి ఇందుకోసం ఎంత ఖర్చవుతుందని అడిగాడు. అందుకు ఆ పోలీస్ అధికారి “దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది.. ముందే డౌన్‌ పేమెంట్‌ ఇవ్వాలి” అన్నాడు. కాదు ముందు 1000 డాలర్లు ఇస్తాను అని బేరం కుదుర్చుకున్నాడు. అలా అక్కడ జరిగిన ఆ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. ఆ డీల్‌ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అక్కడే అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad