భవిష్యత్తులో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్టు ప్రముఖ యాంకర్ అనసూయ స్పష్టం చేశారు. కేవలం వెండితెరకే కాకుండా వెబ్‌సిరీస్‌కు కూడా తాను ప్రాధాన్యతను ఇస్తానని, అందులో నటించేందుకు తాను సిద్ధమేనంటూ అనసూయ చెప్పింది.
కాగా, అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వేదికగా తానా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగువారంతా ఒకచోట చేరిన ఈ వేడుకలో తెలుగుదనం ఉట్టిపడలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రముగ్దులను చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ, సినీ దిగ్గజాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తానా సభల్లో పాల్గొన్న అనసూయ మీడియాతో మాట్లాడుతూ తనకు కూడా అందరి నటుల్లానే ఇతర సినీ ఇండస్ట్రీలలో నటించాలని ఉందని, అనసూయ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాదని రుజువు చేసుకున్నానని, తనకు ఉన్న టాలెంట్‌తో ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై తానేంటో నిరూపించుకుంటానని, ఆ దిశగా అనుగుణంగా తన అడుగులు పడుతున్నాయని అనసూయ చెప్పుకొచ్చింది.