ఇకమీదట ఇంటర్ విద్యార్థుల తల్లులు ఏడాదికి రూ.15వేల రూపాయలు పొందబోతున్నారు. పిల్లల్ని బడులకు పంపించే తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇచ్చే అమ్మఒడి పథకాన్ని ఇంటరు విద్యార్థులకూ వర్తింపజేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది.
తెల్ల రేషన్‌కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులెవరైనా ఈ పథకానికి అర్హులే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జరిగిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో జగన్ ఈ మేరకు స్పష్టం చేశారు.