Home General ప్ర‌పంచ కుబేరుల జాబితా..!

ప్ర‌పంచ కుబేరుల జాబితా..!

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతుడి స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకున్నాడు. బ్లూంబ‌ర్గ్ బిలియ‌నీర్ ఇండిక్స్ విడుద‌ల చేసిన జాబితాలో ఆయ‌న తొలిస్థానంలో నిలిచారు. బెజోస్ త‌రువాత రెండో స్థానంలో కొన‌సాగుతున్న మైక్రోసాఫ్ట్ కార్పొరేష‌న్ స‌హ వ్య‌వస్థాప‌కుడు బిల్‌గేట్స్‌కు ఈ సారి షాక్ త‌గిలింది.

గేట్స్‌ను వెన‌క్కునెట్టి ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్డ్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియ‌న్ డాల‌ర్స్. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ త‌న భార్య మకెంజి బెజోస్ భారీగా భ‌ర‌ణం స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికీ 125 బిలియ‌న్ డాల‌ర్స్‌తో తొలిస్థానంలో నిలిచారు.

బిల్‌గేట్స్ త‌న సంస‌ద‌న‌లోని 35 బిలియ‌న్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చిన‌ప్ప‌టికీ మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ చీఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకుని భ‌ర‌ణం పొందిన మకెంజి ధ‌నిక మ‌హిళ‌ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నిక‌ర ఆస్తుల విలువ 40 బిలియ‌న్ డాల‌ర్లు.

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత అనీల్ అంబాని భార‌త్‌లో అత్యంత ధ‌నికుడిగా తన స్థానాన్ని పదిల‌ప‌రుచుకున్నారు. ఆయ‌న ఆస్తుల విలువ 51.8 బిలియ‌న్ డాల‌ర్లు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనీల్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అంబానీ త‌రువాతి స్థానంలో విప్రో అధినేత అజిమ్ ప్రేమ్‌జి 20.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ( ప్ర‌పంచ వ్యాప్తంగా 48వ స్థానం) నిలిచారు. హెచ్‌సీఎల్ టెక్స్ శివ నాడార్ 92వ స్థానంలో, కొట‌క్ మ‌హేంద్ర ఎండీ ఉదయ్ కొటక్‌ 96వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad