Home Latest News ఎన్టీఆర్ బ‌యోపిక్స్‌లో మొత్తం మూడు వ‌ర్ష‌న్స్‌.! ఏమిటో తెలుసా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్స్‌లో మొత్తం మూడు వ‌ర్ష‌న్స్‌.! ఏమిటో తెలుసా..?

ఇటీవ‌ల కాలంలో పినీ ప‌రిశ్ర‌మ‌లో బ‌యోపిక్‌ల చిత్రీక‌ర‌ణ ఎంత వేగంగా జ‌రుగుతుందో.. అంతే వేగంగా వాటికి స్పూఫ్ అంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైర‌ల్ అయిపోతున్నాయి. ఆ నేప‌థ్యంలోనే ఈ నెల 9వ తేదీన విడుద‌ల కానున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై కూడా కొన్ని స్ఫూఫ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.అందులో భాగంగా ఓ వీడియోలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు సంబంధించి ఏపీ సీఎం చంద్ర‌బాబు అయితే ఎలా చెబుతారు..? ల‌క్ష్మీ పార్వ‌తి అయితే ఎలా చెబుతుంది..? ఆ రోజుల్లో రాజ‌కీయాల్లో ఉన్న ఉన్న మ‌రికొంద‌రు అయితే ఎలా చెబుతారు..? అన్న కోణంలో వీడియోను రూపొందించా. ఆ వీడియోలో పేర్కొన్న వివ‌రాలిలా ఉన్నాయి..

1989లో ఎన్టీఆర్ ఓడిపోయాక కుటుంబ స‌భ్యులెవ‌రూ ప‌ట్టించుకోలేదు. అప్పుడు ఎన్టీఆర్ మాన‌సికంగా కుంగిపోయాడు. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌కు ఒక తోడు అవ‌స‌ర‌మైంది. కాబ‌ట్టి ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్‌కు ద‌గ్గ‌రైంది. 1994 ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీపార్వ‌తి ప‌క్క‌నే ఉండి ప్ర‌తీ స‌భ‌లోనూ, ప్ర‌తీ ప‌నిలోనూ అన్ని బాగోగులు చూసుకుంది. అంత రిలేష‌న్‌షిప్ ఏర్ప‌డ్డాక రాజ‌కీయాల్లో జోక్యం స‌హ‌జం. ఇదే సాకుగా చూపి చంద్ర‌బాబు నాయుడు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ల‌క్ష్మీపార్వ‌తి ఫోటోను ఇంట్లో పెట్టుకుని, రోజూ దండంపెట్టి బ‌య‌ట‌కు రావాలా..!                                                  – ఇదీ ల‌క్ష్మీపార్వ‌తి వ‌ర్ష‌న్‌.

యాక్చ‌వ‌ల్‌గా 1989లో టీడీపీ ఓడిపోయాక ఎన్టీఆర్ ప్రాబ‌ల్యం త‌గ్గింది. 1989 నుంచి 1994 దాకా పార్టీ కేడ‌ర్ ప‌క్క‌కెళ్ల‌కుండా నెక్ట్స్ ఎలెక్ష‌న్స్‌లో పార్టీ గెల‌వ‌డానికి చంద్ర‌బాబు నాయుడు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అలాంటిది పార్టీ ప‌గ్గాలు ల‌క్ష్మీ పార్వ‌తి చేతుల్లోకి వెళుతుంటే చూస్తూ ఊరుకోవాలా.?? అందుకే కుటుంబ స‌భ్యుల‌తో స‌హా తిరుగుబాటు చేసి సీఎం అయ్యాడు. –                          – ఇదీ చంద్ర‌బాబు వ‌ర్ష‌న్‌

అంద‌రూ అనుకుంటున్న‌ట్టు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచింది ఎన్టీఆర్‌కు కాదు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. యాక్చ‌వ‌ల్‌గా 1995లో ద‌గ్గుబాటి చంద్ర‌బాబు ఇద్ద‌రూ క‌లిసే ఎన్టీఆర్‌పై ఎదురు తిరిగారు. అప్పుడు ద‌గ్గుబాటి ద‌గ్గ‌ర 80 మంది ఎమ్మెల్యేలు ఉండ‌టంతో నీకు డిప్యూటీ సీఎం ఇస్తాన‌ని చంద్ర‌బాబు సీఎం అయ్యాడు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక ద‌గ్గుబాటు వెంక‌టేశ్వ‌ర‌రావును బాబూ.. ఎవ‌రు బాబు నీవు అని అన్నాడు. ఆ త‌రువాత ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న ఎమ్మెల్యేల‌ను వెన‌క్కి వ‌చ్చేయ‌మంటే 18 మంది మాత్ర‌మే వ‌చ్చారు. దీంతో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు 80 పోయే…. 18 వ‌చ్చే.                                – ఇదీ మ‌రికొంద‌రి వ‌ర్ష‌న్‌

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad