Home Latest News మ‌ద్యం దుకాణాలు బంద్‌

మ‌ద్యం దుకాణాలు బంద్‌

దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు విడ‌త‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్థానాలు, ఏపీలో 175 శాస‌న‌స‌భ 25 ఎంపీ స్థానాల‌కు ఈ నెల 11న తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో 17 స్థానాల‌కుగాను మొత్తం 443 మంది అభ్య‌ర్ధులు పోటీలో ఉన్నారు. ఒక్క నిజామాబాద్ నుంచే 185 మంది బ‌రిలో ఉన్నారు. ఇప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌ధానంగా పార్టీల అగ్ర‌నేత‌లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. హెలికాప్ట‌ర్‌లో నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌భ‌ల‌ను కేసీఆర్ చుట్టేస్తున్నారు. మ‌రో వైపు తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అభ్య‌ర్ధుల‌తో క‌లిసి రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు. అటు ఏపీలోను చంద్ర‌బాబు అలుపెర‌గ‌కుండా స‌భ‌లు, రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ రోజూ వీలైనంత ఎక్కువ‌గా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్ధులు కూడా ప్ర‌చారంలో జోరు చూపిస్తున్నారు.

నేటితో ప్ర‌చార‌ప‌ర్వం ముగియ‌నుండ‌టంతో సాయంత్రం 6 గంట‌ల నుంచి మ‌ద్యం విక్ర‌యాల‌పై అధికారులు నిషేదం విధించారు. పోలింగ్ జ‌రిగే 11వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిషేదం ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. డ్రైడే పాటించ‌ని మ‌ద్యం దుకాణాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad