ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్, ప్రైవేటు కళాశాలలపట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పపడుతూ విద్యానికేతన్ సంస్థల చైర్మన్, నటుడు మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. తిరుపతి – మదనపల్లి రోడ్డుపై విద్యార్ధులతో కలిసి విద్యా సంస్థల ముందే బైఠాయించారు.
విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థుల పురోగతికి తోడ్పడాలని నటుడు మోహన్‌బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఫీజును చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో తాను ఆందోళనకు దిగినట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు తప్పుబడుతూనే అనేక పర్యాయాలు తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
అయితే, ఇలాంటి ర్యాలీలు, ధర్నాలు ఎన్నికలను ప్రబావితం చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. దీంతో రంగంపేట తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో మోహన్‌బాబును అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు అధికారుల సమాచారం.