Home General సొంత చెల్లినే పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా చెక్కేశాడు..!

సొంత చెల్లినే పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా చెక్కేశాడు..!

విదేశాల్లో స్థిర‌ప‌డాల‌న్న అన్న‌ కోరిక నెర‌వేరింది. త‌న‌తోపాటు ర‌క్తం పంచుకుపుట్టిన చెల్లిని కూడా తానుంటున్న దేశానికి తీసుకెళ్లాల‌నుకున్నాడు. అందుకు వీసా నిబంధ‌న‌లు అడ్డొచ్చాయి. దీంతో ఏం చేయాలి..? అని ఆలోచిస్తున్న క్ర‌మంలో భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రో ఒక‌రికి వీసా ఉంటే స‌రిపోతుంద‌ని త‌న స్నేహితుడు చెప్పిన మాట‌లు గుర్తుకొచ్చాయి. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సొంత చెల్లి మెడ‌లో మూడుముళ్ల తాళి క‌ట్టాడు. పెళ్లి చేసుకున్నట్టు ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందే క్ర‌మంలో ఆఖ‌ర‌కు హైకోర్టును సైతం మోస‌గించాడు.

పంజాబ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.. ఆస్ట్రేలియాలో స్థిర‌ప‌డ్డ పంజాబ్‌కు చెందిన ఓ యువ‌కుడు త‌న చెల్లిని కూడా ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు వీసాలేని త‌న చెల్లిని భార్యా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టేందుకు ఒప్పించాడు. నాకు పెళ్లైంది..! నాకు మా ఆవిడ‌కు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కావాలి..! మా ఇద్ద‌రి పేర్ల‌పై వీసా ఇవ్వండి అంటూ ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు చేశాడు. ఆ యువ‌కుడు స‌మ‌ర్పించిన ఆధారాల‌ను ప‌రిశీలించిన అధికారులు అన్నీ క‌రెక్టుగా ఉండ‌టంతో వీసాను మంజూరు చేశారు. భార్యా భ‌ర్త బంధం పేరుతో ఆ అన్నా చెల్లెలు ఇద్ద‌రూ ఆస్ట్రేలియా చెక్కేశారు.

అయితే, మ‌న‌దేశ ఇమ్మిగ్రేష‌న్‌ అధికారుల క‌ళ్లుక‌ప్పిన ఆ అన్నా చెల్లెలు, ఆస్ట్రేలియా అధికారుల క‌ళ్ల‌ను క‌ప్ప‌లేక‌పోయారు. ప్ర‌తీ అంశాన్ని క్షుణ్ణంగా విచారించ‌డంతో వారు భార్యా భ‌ర్త‌లు కాద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అన్నా చెల్లులు ఫేక్ హ‌స్బెండ్‌ అండ్ వైఫ్ రిలేష‌న్ షిప్ వీసాతో త‌మ దేశంలోకి ప్ర‌వేశించిన‌ట్లు నిర్ధారించారు. ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న క్ర‌మంలో ఆ అన్నా చెల్లెలు ఇద్ద‌రూ ప‌రార‌య్యార‌ని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad