Home General 22 ఏళ్ల యువ‌తి గోళ్లు, జుట్టు కత్తిరించాడు.. కార‌ణం అదే..!

22 ఏళ్ల యువ‌తి గోళ్లు, జుట్టు కత్తిరించాడు.. కార‌ణం అదే..!

టెక్నాల‌జీ యుగంలో కూడా వ‌ర‌క‌ట్న వేధింపులు ఇంకా ఉన్నాయా..? అన్న ప్రశ్న‌కు సామాజిక‌వేత్త‌ల నుంచి అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. స‌మాజంలో నేటికీ జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌లు అందుకు ఆధారాలుగా వారు చూపుతున్నారు. త‌మ‌వంతు ప్ర‌య‌త్నంగా ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప్ర‌భుత్వాలు కూడా క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

స‌మాజం ఖండిస్తున్నా ఇంకా చోటు చేసుకుంటున్న వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు సంబంధించిన మ‌రో ఘ‌ట‌న బీహార్‌లోని గోపాల్ గంజ్‌జిల్లాలో చోటు చేసుకుంది. అత్తింటివారు వ‌ర‌క‌ట్నం కోసం వేధించారు.. హింసించారు.. చివర‌కు ఆమె చేతి, కాళ్ల గోళ్ల‌ను ర‌క్తం వ‌చ్చేలా క‌త్తిరించారు.. ఆఖ‌ర‌కు జుట్టును కూడా వికారంగా క‌ట్ చేశారు.. అత్తింటి వారి వికృత చేష్ట‌ల‌తో స్పృహ త‌ప్పిన ఆ గృహిణిని ద‌గ్గ‌ర్లోని రైల్వే ట్రాక్ ప‌క్క‌నే ఉన్న చెట్ల పొద‌ల్లో ప‌డేశారు.

చాలా సేప‌టి త‌రువాత స్పృహలోకి వచ్చిన ఆ మ‌హిళ అత్తింటి వారి వేధింపులు తాళ‌లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన త‌న‌కు, అదే జిల్లాకు చెందిన ర‌వూఫ్ అనే వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేశారని, పెళ్లి స‌మ‌యంలో వ‌ర‌క‌ట్నంగా రూ.2 ల‌క్ష‌ల న‌గ‌దు, బైక్‌ను డిమాండ్ చేయ‌గా, అందుకు స‌రితూగ‌లేని తమ కుటుంబ స‌భ్యులు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చార‌ని, బైక్ త‌రువాత ఇస్తామ‌ని పెళ్లినాడు ఒప్పందం చేసుకున్నార‌న్నారు.

కానీ, పెళ్లి త‌రువాత అత్తింటిలో అడుగుపెట్టిన‌ప్ప‌ట్నుంచి త‌న‌ను అద‌న‌పు క‌ట్నం కోసం వేధిస్తున్నార‌ని ఆ మ‌హిళ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు కేసు నమోదు చేసి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad