Home Latest News 2019 ఎన్నిక‌లు : వైఎస్ జ‌గ‌న్‌పై పోటీ చేయ‌బోయేది ఎవ‌రో తెలుసా..?

2019 ఎన్నిక‌లు : వైఎస్ జ‌గ‌న్‌పై పోటీ చేయ‌బోయేది ఎవ‌రో తెలుసా..?

మ‌రో నెల రోజుల గ‌డువులో ఏపీ ఎన్నిక‌లు జర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఎంపిక‌పై తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అందులో భాగంగానే, ఇప్ప‌టికే క‌డ‌ప‌లో ఏడుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. పులివెందుల నుంచి మ‌రోసారి స‌తీశ్‌రెడ్డిని బ‌రిలోకి దించ‌బోతున్నారు. గ‌తంలో వైఎస్ఆర్ మీద మూడు సార్లు పోటీచేసి ఓట‌మిపాలైన స‌తీశ్‌రెడ్డి జ‌గ‌న్ మీద రెండోసారి పోటీ చేయ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే పులివెందుల‌కు కృష్ణా జ‌లాల‌ను తీసుకొచ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ సారి పులివెందుల‌లో వార్ వ‌న్‌సైడ్ కాద‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తోంది. అలానే క‌మ‌లాపురంలో పుత్తా న‌ర్సింహారెడ్డిని సీఎం చంద్ర‌బాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఓట‌మి పాల‌య్యారు.

అయితే, గ‌తంలో న‌ర‌సింహారెడ్డి వీర‌శివారెడ్డి మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ కోసం ఆయ‌న కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. సీఎం చంద్ర‌బాబు మాత్రం పుత్తా న‌ర్సింహారెడ్డివైపే మొగ్గు చూపింది. అదే స‌మ‌యంలో వీర‌శివారెడ్డి అస‌మ్మ‌తి సెగ‌లు రాజేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మీద దృష్టి పెట్టింద‌ట‌. అలానే, జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డికి స‌యోధ్య కుద‌ర్చంలో టీడీపీ హ‌క‌మాండ్ స‌క్సెస్ అయింది. వారిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డంతో క‌డ‌ప జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వార్ వ‌న్‌సైడ్ అవ‌బోతుందని టీడీపీ వ‌ర్గాలు ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad