Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్‌..!

హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్‌..!

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. ఎక్కడ చుసిన కరోనా నే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ ప్రజల జీవనాన్ని మార్చేసింది. ఇంకా ఈ కరోనా వైరస్ ఒకరికి వచ్చిన ఇంట్లో అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా కరోనా వైరస్ వ్యాపించడానికి నిరోధక శక్తి తక్కువ ఉండటమే.. అందుకే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలి. ఇది పెరగడానికి విటమిన్‌ సి, విటమిన్‌ డి3, జింకు తదితర మాత్రలు ఉపయోగిస్తున్నారు. ఇంకా ఈ మాత్రలు నెల రోజులు వాడాలి అంటే ఒక్కో వ్యక్తి 650 రూపాయిల వరకు ఖర్చవుతుంది.

అయితే మందులతో కాకుండా వంటింట్లో దొరికే పధార్ధాలతో పాటు పౌష్టికాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెంపొదించుకోవచ్ఛు. ఇంకా ఈ నేపథ్యంలోనే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్‌ ఇది. ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం..

హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్‌ ఇదే..

ఉదయం నిద్ర లేవగానే నీటిలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని తీసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది తీసుకున్న అనంతరం 30 నిముషాలు వ్యాయామం చెయ్యాలి. శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి అప్పుడే వీటినిన్ డి లభిస్తుంది. .

ఉదయం టిఫిన్ 8 గంటల లోపు పూర్తి చెయ్యాలి. అయితే టిఫిన్ గా మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు, ఇంకా అందులో క్యారెట్‌, ఆకుకూరలు తురిమి వేసుకోవచ్ఛు మొలకలు తీసుకోవడం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు లభిస్తాయి.

10:30కి సీజనల్ ఫ్రూప్ట్స్ తీసుకోవాలి. జామకాయ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు ఎక్కువగా తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనంలో ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్‌, క్యాబేజీ వంటి కూరలు తీసుకోవాలి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుండి ఇవి రక్షిస్తాయి.

ప్రోటీన్స్ కోసం చికెన్‌ 150-200 గ్రాములు, మటన్‌ 75 గ్రాములు, చేపలు 100 గ్రాములు, పన్నీరు 50 గ్రాములు తీసుకోవాలి. ఇంకా వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.

శాకాహారులు అయితే శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్‌ తీసుకోవాలి.

సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్‌, సెలీనియం, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి.

ఇంకా రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తిచేయాలి.

అయితే బొజనంలోకి జొన్న, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. నిద్రపోయే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మంచిది.

చూశారుగా.. హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్ ఫాలో అవుతే మంచి ఫలితాలు ఉంటాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad