Home సినిమా సినిమా రివ్యూస్ సినిమా రివ్యూ: కృష్ణ అండ్ హిజ్ లీల

సినిమా రివ్యూ: కృష్ణ అండ్ హిజ్ లీల

చిత్రం: కృష్ణ అండ్ హిజ్ లీల
రేటింగ్: 3/5
బ్యానర్:
 వయాకామ్ 1 స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్, వైవా హర్ష, ఝాన్సీ, సంపత్‌రాజ్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కూర్పు: గ్యారీ
ఛాయాగ్రహణం: షానీల్ డియో, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాతలు: సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 1, సంజయ్‌రెడ్డి
సమర్పణ: రానా దగ్గుబాటి
రచన: రవికాంత్ పేరేపు, సిద్ధు జొన్నలగడ్డ
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుదల తేదీ: జూన్ 25, 2020
వేదిక: నెట్‌ఫ్లిక్స్ ఇండియా

రానా దగ్గుబాటి సపోర్ట్ దక్కించుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సోషల్ మీడియాలో గుర్తించదగ్గ సందడే చేసింది కానీ, ఉన్నపళంగా… అంటే ఎలాంటి ప్రకటనలు, హంగామా లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయిపోయింది. నేటితరం ప్రేమకథలను, ప్రేమలో ఈతరం పోకడలను సహజంగా చూపించిన తెలుగు సినిమాలు తక్కువే. బాలీవుడ్‌లో ఇలాంటి మోడ్రన్ లవ్‌స్టోరీస్ తరచుగానే వస్తుంటాయి కానీ తెలుగు చిత్ర సీమ నుంచి బాగా అరుదు. 

‘క్షణం’ దర్శకుడు రవికాంత్, ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు కలిసి రచించిన ఈ లవ్‌స్టోరీ ఈతరం లవ్‌ని ఫిల్టర్ లేకుండా చూపించింది. సరాసరి నెట్‌ఫ్లిక్స్‌లో రావడం వల్ల ఈజీగా దొర్లిపోయే బూతు పదాలు, శృంగార సంబంధిత సంభాషణలు, సన్నివేశాలు మ్యూట్ లేదా ఎడిట్ అవలేదు. అలా అని మరీ చెవులు మూసుకునేటన్ని పదాలు, పక్కనెవరైనా పెద్దలుంటే ఇబ్బంది పడేటంత పచ్చి సన్నివేశాలేమీ లేవు. మోడ్రన్ ట్రెండ్‌లో వుంటూనే మరీ పక్కన ఎవరూ లేకుండా చూసేటంత ప్రైవసీ అవసరం లేనంత లిమిట్స్‌లోనే తెరెకక్కించారు. 

కథాపరంగా కథానాయకుడో కన్‌ఫ్యూజన్ కృష్ణుడు. ఇద్దరమ్మాయిలను సిన్సియర్‌గా ప్రేమించేస్తాడు. ఇద్దరినీ హర్ట్ కాకుండా చూసుకుందామనుకుంటాడు. కానీ రిలేషన్‌షిప్స్‌లో జోడు గుర్రాల స్వారీ జరిగే పని కాదుగా? అందుకే కృష్ణుడు అటు రాధకీ, ఇటు సత్యకీ దొరికేస్తాడు. ఇద్దరినీ గాఢంగా ప్రేమిస్తున్నానని, ఇద్దరిలోను నచ్చిన గుణాలున్నాయని అంటాడు. మరి ఈ కృష్ణుడి లీలకి మజిలీ ఏమిటి? లీగల్‌గానే, ఎథికల్‌గా జస్టిఫై కాని తన ప్రేమకి ముగింపేమిటి? 

ఇలా హీరో ఇద్దరమ్మాయిలను సిన్సియర్‌గా ప్రేమించి, ఇద్దరిలో ఎవరు కావాలనేది తేల్చుకోలేకపోవడం కొత్త కథేమీ కాదు. శోభన్‌బాబు, జగపతిబాబు కాలంలోను ఇలాంటి కథలొచ్చాయి. పవన్‌కళ్యాణ్ బద్రి స్టోరీలైన్ కూడా ఇదే. మరి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ప్రత్యేకత ఏమిటి? అప్పటి మాదిరిగా క్లీన్ రొమాన్స్ కాకుండా… ఇప్పటి తరం వేగానికి తగ్గట్టు, ఈతరం ప్రేమలను ప్రతిబింబించేట్టు చూసుకున్నారు. ఫోన్లో ‘తిన్నావా బేబీ’ అంటూ డ్రమెటిక్ సంభాషణలు కాకుండా… ‘లోదుస్తులు ఏ రంగువి వేసుకున్నావ్?’ లాంటి మాటలు మాట్లాడుకునే ప్రేమజంటని చూపించారన్నమాట. 

ఇద్దరిని ప్రేమించే హీరో ఎక్కడా స్త్రీలోలుడిగా కనిపించకుండా తన కన్‌ఫ్యూజన్ ఏమినేది క్లారిటీగానే చూపించారు. ప్రేమించిన ఇద్దరిని హర్ట్ చేయలేని పరిస్థితుల్లో తనకు తానే మరింత డీప్‌గా సమస్యలోకి జారిపోయి, తనతో పాటే వాళ్లిద్దరినీ కూడా ఎలా లోనికి లాగేస్తున్నాడనేది కన్‌ఫ్యూజన్ లేకుండా తెర మీదకు తేవడంలో దర్శకుడు, రచయితలు సెక్సస్ అయ్యారు. వినోదం తగు పాళ్లలో వుండడం వల్ల కృష్ణుడి లీల అంతగా విసిగించదు. కాకపోతే ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ వుండడం వల్ల కంప్లీట్‌నెస్ లేకపోయింది. అవే సన్నివేశాలు రిపీట్ అవుతోన్న భావన కలుగుతుంది. కథానాయకుడి ఫీలింగ్స్ పంచుకోవడానికి అటు స్నేహితుల కోణం కానీ, ఇటు కుటుంబ కోణం కానీ వాడుకోకపోవడం వల్ల సదరు రిలేషన్స్ కేవలం అలంకారానికి మాత్రం పనికొచ్చాయి. 

హీరోకీ, తండ్రికీ వున్న ఈక్వేషన్‌ని మరీ ఒకే సీన్‌కి పరిమితం చేయగా, అటు తల్లి, చెల్లితో కూడా తగిన కమ్యూనికేషన్ చూపించలేదు. ఇటు స్నేహితులుగా హర్ష. సీరత్ కపూర్ క్యారెక్టర్స్ వున్నా కానీ ఇక్కడా హీరో తన ఎమోషన్స్ పంచుకోడు. దీంతో మొదటి గంట గడిచిన తర్వాత గమనం కుంటుపడుతుంది. షార్ట్ ఫిలింకి సరిపోయే కంటెంట్‌ని స్ట్రెచ్ చేస్తోన్న భావన కలుగుతుంది. నిడివి తగ్గించుకుంటే ఈ సమస్య కొద్ది వరకు కవర్ అయి వుండేది. ఒక్కసారి ప్రేమికుల నుంచి నేపథ్యం పెళ్లిలోకి వెళ్లగానే ఎంతో రిలీఫ్ వస్తుంది. ఈ కథకి లాజికల్ ముగింపేమిటి అనే దానికి అందరికీ కన్విన్సింగ్ ఎండింగ్ ఇచ్చినట్టే చెప్పాలి. 

సిద్ధు తను సృష్టించుకున్న పాత్రకు తగిన న్యాయమే చేయగలిగాడు. అక్కడక్కడా ఖుషీలో పవన్‌కళ్యాణ్‌ని అనుకరిస్తున్నట్టు అనిపించినా కానీ ఓవరాల్‌గా సిద్ధు మెప్పిస్తాడు. శ్రద్ధ శ్రీనాధ్ తాను ఇంతకుముందు పోషించిన పాత్రలకు భిన్నంగా ధూమపానం, మద్యపానం చేస్తూ కనిపిస్తుంది. ప్రాక్టికల్‌గా వ్యవహరించే పాత్రలో ఆమె అభినయం బాగుంది. షాలిని పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. హర్ష పాత్రని మరింతగా వాడుకుని వుండాల్సింది. సంపత్ రాజ్ కనిపించే కొద్ది సన్నివేశాల్లోను తన మార్క్ చూపించాడు. సీరత్ కపూర్, ఝాన్సీ సపోర్టింగ్ రోల్స్ చేసారు. 

శేఖర్ కమ్ముల సినిమా తరహాలో నేపథ్య సంగీతం క్లాసికల్ టచ్‌తో వీనుల విందు చేస్తుంది. ‘పులిెర బాగా కలిపెనే’ అంటూ హీరోని వెటకరిస్తూ చేసిన ప్రయోగాలు బాగున్నాయి. సంగీతం, ఛాయాగ్రహణం, సంభాషణలు ఈ చిత్రానికి ఎస్సెట్స్ అని చెప్పాలి. దర్శకుడు రవికాంత్ తన టార్గెట్ ఆడియన్స్‌ని దృష్టిలో వుంచుకుని వారిని ఎంటర్‌టైన్ చేసే చిత్రాన్నే రూపొందించాడు. క్షణం తర్వాత పూర్తి కాంట్రాస్ట్ చూపించి దర్శకుడిగా వైవిధ్యం చాటుకున్నాడు. 

కొన్ని కొన్ని ఇబ్బందులున్నాయి కానీ ఓవరాల్‌గా వినోదం మిస్ కాకుండా, రిలేటబుల్ క్యారెక్టర్స్, సిట్యువేషన్స్‌తో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో కాలక్షేపమయితే జరిగిపోతుంది. సినీ వినోదం కోసం దేవులాడాల్సిన పరిస్థితుల్లో ఒక పూట కాలక్షేపానికి ఈ చిత్రం అక్కరకు వస్తుంది. 

బాటమ్ లైన్: కృష్ణ లీలలు!

- Advertisement -

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

Disha Pathani Beautiful Pics

- Advertisement -Dummy Ad