Home టాప్ స్టోరీస్ మహేష్ కామెంట్: నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకెప్పటికీ తెలియదు

మహేష్ కామెంట్: నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకెప్పటికీ తెలియదు

టాలీవుడ్లో కుటుంబానికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. అతడి తీరు చూస్తే పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు. తన పిల్లలంటే.. ముఖ్యంగా కూతురు సితార అంటే మహేష్‌కు ఎంతిష్టమో పలు సందర్భాల్లో చూశాం. సోమవారం సితార 8వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో కూతురిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు మహేష్.

తన పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదిగిన తీరు.. తనతో గడిపిన అనుభవాలతో ఒక స్వీట్ వీడియోను షేర్ చేసిన మహేష్.. ‘‘చాలా వేగంగా 8వ ఏడుకు వచ్చేశావ్. నిన్ను నేనెంతగా ప్రేమిస్తానంటే.. అది నీకెప్పటికీ తెలియనంత. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని కామెంట్ పెట్టాడు. దీంతో పాటుగా #situpapaturns8 అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా మహేష్ జోడించాడు. మరోవైపు నమ్రత శిరోద్కర్, గౌతమ్ సైతం వేర్వేరుగా సోషల్ మీడియాలో సితారకు విషెస్ చెప్పారు.

తమ జీవితాల్లోకి సితార అంతులోని సంతోషాన్ని తీసుకొచ్చిందని.. తను పుట్టడమే తన జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయమని అన్న నమ్రత.. ప్రేమ, జాలి, ఆపేక్ష ఉన్న అమ్మాయిగా సితార ఎదుగుతుండటం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఇక సితార తన వీపుమీదున్న ఫొటోను షేర్ చేసిన గౌతమ్.. తన పిగ్గీ బ్యాక్ పార్ట్‌నర్‌కు హ్యాపీ బర్త్ డే అని విష్ చేశాడు. మహేష్ అభిమానులు లక్షల మంది సితారకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తుండటం విశేషం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad