Home టాప్ స్టోరీస్ పూరీ ఫ్యాన్స్.. ఇది ఫాలో అవ్వాల్సిందే

పూరీ ఫ్యాన్స్.. ఇది ఫాలో అవ్వాల్సిందే

జీవిత సారాన్ని తూటాల్లాంటి మాట‌ల‌తో.. సూటిగా సుత్తి లేకుండా చెప్ప‌గ‌ల నైపుణ్యం ఉన్న రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఈ త‌రం యువ‌త‌కు ఏ స్ట‌యిల్లో చెబితే విష‌యం ఎక్కుతుందో ఆయ‌నకు చాలా బాగా తెలుసు. నేనింతే, బిజినెస్‌మేన్ లాంటి సినిమాల్లో పూరి బోధించిన జీవిత పాఠాలు చాలామంది మ‌న‌సుల్లోకి దూసుకెళ్లిపోయాయి.

ఆ మాట‌లు ప్రీచింగ్‌లా అనిపించ‌కుండా ఆలోచింప‌జేసేలా.. చురుకు పుట్టించేలా ఉంటాయి. పూరి ఏదైనా చెబుతుంటే విన‌బుద్ధేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఐతే త‌న ఐడియాల‌జీని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాలు, సినిమా వేడుక‌లకు ప‌రిమితం అయిపోకుండా ఇప్పుడో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు పూరి.

త‌మ భావాలు చెప్ప‌డానికి ప్ర‌ముఖులు ఎంచుకున్న మీడియాలోకి పూరి కూడా వ‌చ్చేశాడు. పోడ్‌కాస్ట్‌లో ఆయ‌న అకౌంట్ తెరించారు. అందులో మ్యూజింగ్స్ పేరుతో త‌న భావాలు, అనుభ‌వాలు, పాఠాలు పంచుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అరంగేట్రంలోనే చ‌క్క‌టి ఆడియో మెసేజ్‌ల‌తో త‌న అభిమానుల్ని ఆక‌ర్షించారు పూరి. అంద‌రూ గొప్ప అనుకునే అమెరికాకు అస‌లు చ‌రిత్ర‌, సంస్కృతి అంటూ ఏమీ లేవ‌ని.. వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాల గురించి ఆలోచిస్తుంటార‌ని.. కానీ గొప్ప చ‌రిత్ర‌, సంస్కృతి ఉన్న ఇండియ‌న్స్ వాటిలోకి వెళ్ల‌కుండా, కొత్త‌గా ఏ ప్ర‌య‌త్న‌మూ చేయ‌కుండా క‌ష్టం తెలియ‌కుండా కాలం గ‌డిపేస్తుంటార‌ని అన్నాడు పూరి.

జ‌నాభా పెరుగుద‌ల‌తో వ‌స్తున్న క‌ష్టాల గురించి కూడా ఇందులో పూరి చ‌క్క‌గా వివ‌రించాడు. మ‌రోవైపు అమితాబ్ బ‌చ్చ‌న్ మీద కూడా ఆస‌క్తిక‌ర ఆడియో సందేశం పెట్టాడు. ఇవి విన్న ఎవ‌రైనా.. ఇక రెగ్యుల‌ర్‌గా పోడ్‌కాస్ట్‌లో పూరీని ఫాలో అయిపోవాల్సిందే అనుకుంటారు. ప్ర‌కాష్ రాజ్ స‌హా అంద‌రూ పూరి ఫ్యాన్స్‌కు ఇదే పిలుపునిచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad