Home సినిమా టాలీవుడ్ న్యూస్ మెగాస్టార్‌కు విషెస్ చెప్పిన జోంబీ రెడ్డి

మెగాస్టార్‌కు విషెస్ చెప్పిన జోంబీ రెడ్డి

Zombie Reddy Tribute To Chiranjeevi

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన తొలి చిత్రం ‘అ’తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. సినిమాలో బడా నటీనటులకంటే, కథలో దమ్ముంటే చాలని నిరూపించుకున్న ఈ డైరెక్టర్, తన రెండో చిత్రం ‘కల్కి’తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. కేవలం కథను హీరోగా చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం చూపించేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే తన కొత్త చిత్రం ‘జోంబి రెడ్డి’ని అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టాడు. కాగా తెలుగులోనే తొలి జోంబి చిత్రాన్ని తెరకెక్కి్స్తున్న ప్రశాంత్ వర్మ, తాజాగా తన చిత్ర యూనిట్ తరఫున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తనదైన స్టయిల్‌లో చెప్పుకొచ్చాడు. జోంబి రెడ్డి చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పోస్టర్‌లో జోంబిలను ఎదుర్కొంటున్న హీరో, చేతిలో గధ, చొక్కా వెనకాల చిరు ఫోటోతో ముందుకెళ్తున్నాడు.

ఈ విధంగా చిరుపై తనకున్న అభిమానాన్ని చాటిచెబుతూనే తన సినిమాలోని పోస్టర్‌ను వినాయక చవితి శుభాకాంక్షలతో రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా పోస్టర్‌తో చిరుకు అదిరిపోయే బర్త్‌డే విషెస్ అందించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి జోంబి రెడ్డితో ప్రశాంత్ వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad