Home సినిమా టాలీవుడ్ న్యూస్ జోంబీ రెడ్డి కూడా కాపీయేనా?

జోంబీ రెడ్డి కూడా కాపీయేనా?

Zombie Reddy Poster Copied From Hollywood

‘అ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమాతో అదిరిపోయే ఫేం సంపాధించుకున్నాడు. ఈ సినిమాలోని కంటెంట్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించే సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తరువాత ‘కల్కి’ అనే రివెంజ్ డ్రామాను తెరకెక్కించి యావరేజ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎలా అల్లాడుతుందో అందరికీ తెలిసిందే. ఇదే సబ్జెక్టుపై తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్.

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘జోంబీ రెడ్డి’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తొలి జోంబీ మూవీగా ఈ సినిమా అరుదైన గుర్తింపును తెచ్చుకుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఇప్పటికే చాలా హాలీవుడ్ హార్రర్ చిత్రాల్లో చూసినట్లు అనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది అని వారు సూచిస్తున్నారు.

కాగా మరికొందరు ఈ సినిమా ఫస్ట్ లుక్‌నే హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ కొట్టారని, ఇక సినిమా ఎలా ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులను భయపెట్టాలని చూసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు అభాసుపాలవుతున్నాడు. ఇలా హాలీవుడ్ చిత్రాల నుండి కాకుండా సొంతంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ కామెంట్స్‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad