Home సినిమా త్రివిక్ర‌మ్ పారితోషికం అన్ని కోట్లా...బాబోయ్....

త్రివిక్ర‌మ్ పారితోషికం అన్ని కోట్లా…బాబోయ్….

trivikram thumb

స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ ల పారితోష‌కం ఎంత అనే విష‌యం….. అభిమానుల‌కు ఎప్పుడు ఆస‌క్తిగానే ఉంటుంది. అస‌లు బ‌య‌ట‌కు రాక‌పోయినా సుమారుగా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రెమ్యూన‌రేష‌న్ గురించి ఇక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. రైట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారాడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. ఈయ‌న‌కు మాట‌ల మాంత్రికుడు అనే పేరు కూడా ఇచ్చేశారు. ఇందుకు కార‌ణం ఈయ‌న రైట‌ర్ గా ప‌నిచేసిన ప‌లు సినిమాల్లో పేలిన కామెడీ పంచ్‌లు, సెంటిమెంట్ డైలాగులే. రైట‌ర్‌గా స్వ‌యం వ‌రం, నువ్వునాకు న‌చ్చావ్, చిరున‌వ్వుతో, మ‌న్మ‌ధుడు లాంటి హిట్ సినిమాలు అందుకున్నారు.

నువ్వే నువ్వే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టిన…త్రివిక్ర‌మ్ అంచెలంచెలుగా ఎదిగారు. అతడు సినిమాతో త్రివిక్ర‌మ్ సినిమా మారుమ్రోగిపోయింది. జ‌ల్సా, అత్తారింటికిదారేది, ఆఆ, అర‌వింద స‌మేత లాంటి మంచి హిట్స్ అందుకున్నాడు. ఖ‌లేజా, అజ్ఞాత‌వాసి లాంటి ప్ర‌యోగాల‌ను చేసి ఫ్లాపుల‌ను కూడా మూట‌క‌ట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ఈ ఏడాది ప్ర‌ధ‌మాంకంలోనే అల‌వైంకుఠ‌పురంలో సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ ద‌క్కించుకున్నాడు. అల్లు అర్జున్ తో త్రివిక్ర‌మ్ చేసిన మ్యాజిక్ కోట్ల వ‌ర్షం కురిపించింది. దీంతో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పేరు మ‌రోసారి మోత‌మోగింది. తాజా హిట్ తో టాప్ డైరెక్ట‌ర్ స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. వి వి వినాయ‌క్, పూరి జగ‌న్నాథ్ లాంటి మాస్ ద‌ర్శ‌కుల‌ను కూడా మించిపోయాడు.

విజ‌యాల‌తో పాటే త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ కూడా పెరిగిపోయింద‌నే వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అల వైకుంఠ‌పురంలో సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ …….త‌న త‌ర్వాత సినిమాను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ అక్ష‌రాల 20 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ కెరీర్‌లో ఇదే అత్య‌ధిక పారితోషికం అనే టాక్ న‌డుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాని హారిక‌, హాసిని క్రియేష‌న్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ క‌లిసి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న‌న ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి కాగానే …….ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. నిజానికి త్రివిక్ర‌మ్ ది, చిన్న‌బాబుది విడ‌దీయ‌లేని బంధం అనే చెప్పాలి. ఎందుకంటే గ‌త ఆరు సినిమాలు చిన‌బాబు కోస‌మే చేశారు త్రివిక్ర‌మ్. వాటిలో ప్లాపుల కంటే విజ‌యాలే ఎక్కువుగా ఉన్నాయి. ఇక త్రివిక్ర‌మ్ పెన్నుపై బాగా న‌మ్మ‌క‌మున్న నిర్మాత చిన‌బాబు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సో….ఒక ద‌ర్శ‌కుడికి 20 కోట్ల పారితోషికం అంటే….చాలా పెద్ద మ్యాట‌రే. ఈ స్థాయిలో రాజ‌మౌళి మిన‌హా ఎవ‌రూ తీసుకోలేదేమో అని అంటున్నారు విశ్లేష‌కులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad