Home సినిమా ఎంతో శ్రమించాం.. కానీ సక్సెస్ అందుకోలేకపోయాం : రామ్ చరణ్

ఎంతో శ్రమించాం.. కానీ సక్సెస్ అందుకోలేకపోయాం : రామ్ చరణ్

ఈమద్యే విడుదలైన రామ్ చరణ్ “వినయ విధేయ రామ” సినిమా తెలుగు పరిశ్రమలోనే బారి డిజాస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత చరణ్ ఇలాంటి సినిమా తీశాడేంటి అని అయన అభిమానులు చాల బాధపడ్డారు.. చేసేది లేక ఆ సినిమాను మర్చిపోయారు కూడా, ఇలాంటి టైంలో “వినయ విధేయ రామ” చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంగళవారం‌ ఓ ప్రకటన విడుదల చేశారు చరణ్. ఈ ప్రకటన సారాంశం చూస్తే మేమంతా బోయపాటిని చాలా నమ్మము, కానీ అతడు మమ్మల్ని నిలువునా ముంచేశాడు అనేలా ఉంది.

చరణ్ ప్రకటన ఒకసారి చూస్తే “ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల, మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. మా “వినయ విధేయ రామ” సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. అలాగే నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది.

మా చిత్రాన్ని నమ్మిన డిస్టిబ్యూటర్స్ కి మా కృతజ్ఞతలు. మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్‌చరణ్‌’ అంటూ రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

దాంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే అది ఫ్లాప్ సినిమా అని చుసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పాడు.. చేసేది లేక మర్చిపోయారు కూడా.. అలాంటి టైములో ఎక్కడా కూడా ఆ సినిమా దర్శకుడు “బోయపాటి శ్రీను” పేరు ప్రస్తావించకుండా ప్రకటన చేసాడు ఆంటే అర్ధం ఏంటి ? మా అందరిని బోయపాటి నిలువునా మోసం చేసాడు అనేకదా అర్ధం అంటూ సరికొత్త చర్చకు దారి తీసింది.. ఈ ప్రకటనను చూస్తే భవిషత్తులో బోయపాటి శ్రీనుతో ఏ హీరో కూడా సినిమా తీయడు అని స్పష్టంగా అర్ధం అవుతుంది. మరీ ఈ విషయం బోయపాటి ఏం వివరణ ఇస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad