Home సినిమా 'మల్లేశం' ను లక్ష్మీ యంత్రం కాపాడుతుందా..?

‘మల్లేశం’ ను లక్ష్మీ యంత్రం కాపాడుతుందా..?

టాలీవుడ్, బాలీవుడ్ లో కానీ ఎటు చూసిన ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ నటులు, రాజకీయ ప్రముఖుల జీవితగాథలే కాదు సామాన్యుల జీవితాలు కూడా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యములోనే చేనేత కార్మికుడిగా ప్రఖ్యాతిగాంచిన మల్లేశం జీవిత చరిత్రను ‘మల్లేశం’ పేరు మీదుగా తెరకెక్కిస్తున్నారు. పద్మ శ్రీ అవార్డులు అందుకున్న గొప్ప వారిలో ఒక్కడైన తెలంగాణ వ్యక్తి చింతకింది మల్లేశం గురించి  అతని జీవితచరిత్ర ను బయోపిక్ గా తీస్తున్నారు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న మల్లేశం పాత్రలో కమేడియన్ ప్రియదర్శిని నటిస్తున్నాడు. మల్లేశం తల్లి పాత్రలో యాంకర్ ఝాన్సీ నటిస్తుంది. శ్రీ అధికారి నిర్మాతగా వ్యవహరించగా, రాజ్.ఆర్ సహనిర్మాతగా మరియు దర్శకత్వం చేస్తున్నాడు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదల చేశారు.

మల్లేశం జీవిత కథ:

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మండలంలో  మారుమూల శారాజీపేట గ్రామానికి సంబందించిన వ్యక్తి చింతకింది మల్లేశం. నిరుపేద, చేనేత కుటుంబానికి చెందినవాడు. ఇతని ఆర్థిక ఇబ్బందుల వలన ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం నడిపిస్తున్న తన తల్లి లక్ష్మికి అండగా ఉంటుండగా, ఒక చీరను నేయటానికి దారం ఆసు పోయాలంటే కనీసం రోజుకు పద్దెనిమిది వేల సార్లు దారాన్ని కండెలా తిప్పితే కానీ చీర పూర్తవదు. ఇలా లక్ష్మీ పని పూర్తయ్యాక ఆ రోజంతా భుజం నొప్పితో బాధ పడుతుండటం చూసి, ఆమెను ఈ కష్టం నుండి ఎలాగైనా వాళ్ళ అమ్మకు విముక్తి కలిగించాలనుకున్నాడు.

తన ఆలోచనకు ప్రాణం పోయాలని ఉద్దేశ్యంతో, వెంటనే ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా అతనికి నిరాశే ఎదురయింది. తన ఆశయాన్ని చేరుకునేందుకు మల్లేశం హైదరాబాద్ చేరుకున్నాడు. జీవనోపాధికోసం ఇక్కడ చిరు ఉద్యోగం చూసుకున్నాడు. ఆసు యంత్రానికి కావాల్సిన పార్టులు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా మొత్తం యంత్రం తయారు కావడానికి ఏడేళ్లు పట్టింది. ఇలా తన తల్లి బాధనే కాకుండా ఎందరికో చేనేత వృత్తి పై ఆధారపడిన వారందరికీ విముక్తి కలిగించాడు. ఈ ఆసు యంత్రానికి తన తల్లి లక్ష్మీ పేరు పెట్టాడు. ఏడూ సంవత్సరాలుగా మల్లేశం పడ్డ కృషికి, చేనేత పరిశ్రమలో తీసుక వచ్చిన సరికొత్త ఆవిష్కరణకు ప్రభుత్వ గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం మల్లేశంని పద్మశ్రీ  అవార్డుతో సత్కరించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad