Home సినిమా ఓటీటీలోకి “కేజీయఫ్ చాప్టర్ 2″?

ఓటీటీలోకి “కేజీయఫ్ చాప్టర్ 2″?

maxresdefault 6

2018లో ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుదలైన కేజీయఫ్ సినిమా భారీ రికార్డులను నెలకొల్పింది. దీంతో తదుపరి చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీనికి తగ్గట్టుగానే చిత్రబృందం మూవీని నిర్మించింది. ప్రస్తుత 97 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలతో షూటింగ్ పూర్తి కానుంది. మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నది అందరికీ తెలిసిన విషయమే. లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్నది ఎవరికీ అంతుపట్టని విషయం. థియేటర్లు తెరుచుకున్న ఒకప్పటిలాగా ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు.

ఇవన్నీ కలసి సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపించన్నాయి. దీంతో మధ్యస్థాయి సినిమాలు ఓటీటీ వేదికల్లో విడుదలవుతున్నాయి. ఇప్పుడు ఈ దారిలో కేజీయఫ్ కూడా పయనిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓటీటీలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికి మూవీ టీం స్పందించలేదు. తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమా ఓటీటీలో వాటిలో విడుదలకావడం లేదని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ కు నాలుగు నుండి ఐదు నెలలు పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. అంటే 2021 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉండటంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం ఉండదని చిత్రబృందం అనుకుంటుంది. మరోవైపు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ అనంత్ నాగ్ రోల్ కు రీప్లేస్ కాదని మూవీ ప్రకటించింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad