Home టాప్ స్టోరీస్ భారీ సినిమాలకు కలెక్షన్లు వస్తాయా ?

భారీ సినిమాలకు కలెక్షన్లు వస్తాయా ?

South Indian Movies 2020 Horizontal image with text  1200 x 630 100 1

ప్రస్తుతం కరోనా దాటికి భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రియల్ ఏస్టేట్, ట్రాన్సపో ర్ట్ వంటి రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీ నష్టాలను చవిచూసింది. గత ఐదు నెలలుగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఏటువంటి సినిమాలు విడుదల కాలేదు. సమీప భవిష్యత్తులో థియేటర్లో తెరుచుకుంటాయనే నమ్మకం కూడా లేదు. ఈ సమయంలో భారీ సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ఆదిపురుష్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లకు పైగా ఉండనుందని తెలుస్తోంది. వాస్తవానికి నేటి పరిస్థితుల్లో ఆ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించడం రిస్క్ తో దృష్టితో కూడిన పని.

ఒకప్పటి లాగా సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా ప్రభుత్వం ఆదేశాల మేరకు థియేటర్లను  50 శాతం ప్రేక్షకులతో మాత్రమే నడిపించే వలసి ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్లకు మరియు థియేటర్ ఓనర్ లు కూడా భారీ నష్టాలను మిగుల్చుతుంది. ఎక్కువగా నిర్వహణ వ్యయం పెరిగి కలెక్షన్ లో తగ్గుతాయి. దీనికి అదనంగా శానిటైజర్ లు, పరిశుభ్రత కలిగించడం కత్తి మీద సాము వంటిది. ఒకవేళ ఇవన్నీ చేసినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేదు. గత ఐదు నెలలుగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ప్రజలు సినిమా కోసం భారీ స్థాయిలో డబ్బులు వెచ్చిస్తారా అన్నది విశ్లేషకులు కూడా అర్థం కాని అంశం గా తయారైంది.

ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.500 కోట్లతో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. గతేడాది ఈ సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే తాజాగా తమ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చేయాలని ఒత్తిడి చేశారు.ఇక కేజిఫ్-2 విడుదల లో కూడా సందిగ్ధం ఏర్పడింది. బాహుబలి రాబట్టిన కలెక్షన్లను చూసిన అనేక మంది ఇతరులు సినిమా బడ్జెట్లు ఒక్కసారిగా పెంచేశారు. అయితే ప్రస్తుత ఈ పరిస్థితుల్లో ఇదంతా మంచిదికాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ టీ సిరీస్ “ఆదిపురుష్” సినిమా బడ్జెట్ విషయంలో కోత విధించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా భారీ సినిమాలకూ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నది అక్షర సత్యం. ఈ సమయంలో ప్రొడ్యూసర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దివాలా తీయడం సాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad