Home సినిమా వ‌ర్మ ఎందుకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడంటే...

వ‌ర్మ ఎందుకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడంటే…

rgv 2

ద‌ర్శ‌కుడు వ‌ర్మ ఏం చేసినా ఒక సంచ‌ల‌న‌మే. ఇందుకు ఆయ‌న సినిమాలే కార‌ణం. ఆత్మక‌థ‌లు, నిజ‌జీవిత క‌థ‌లు అని ఏదో ఒక దాన్ని ప‌ట్టుకుని తెకెక్కిస్తుంటారు. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో అద్బుత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన వ‌ర్మ‌…ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ కూడా అద‌ర‌గొట్టాడు. వ‌రుస విజ‌యాలు అందుకుని …..త‌న ప్ర‌తిభ‌ను నార్త్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు కూడా రుచి చూపించాడు. ఒక ద‌శ‌లో టాలీవుడ్ లో సినిమాలు చేయను అంటూ తట్ట బుట్ట సర్దేసి……. బాలీవుడ్ కు మకాం మార్చేసిన వర్మ ….అక్కడ తనతో సినిమాలు చేయడానికి ఎవరూ దొరకకపోవడంతో తిరిగి టాలీవుడ్ వచ్చేశాడు.తన కథలో పటుత్వం తగ్గడంతో …..వరుస ఫ్లాపులు మూట‌క‌ట్టుకున్నాడు. డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ ను న‌ష్టాల పాలు చేశాడు. దీంతో పెట్టిన డబ్బులను రెండింతలుగా రాబట్టుకోవడం కోసం వివాదాలు సృష్టించడం లేదా తన చిత్రాలు వివాదాల్లో ఇరుక్కునేల చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచడం….త‌ద్వారా వాళ్ళని థియేటర్లకు వచ్చేలా చేశాడు.ఎవరి కిటుకైన కొద్దికాలమే పని చేస్తుంది.
అందుకే జనాలు ఈ మధ్య రాంగోపాల్ వర్మ చిత్రాలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు. దీనితో ఓటిటిల పై వ‌ర్మ‌ పడ్డారు.అక్కడ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ . అందుకే అందులో చేయాల్సిన రాక్షస ప్రయత్నాలన్నీ చేశారు. బహుశా అవి కూడా బెడిసి కొట్టినట్టున్నాయి అందుకే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ చిత్రాలు చేస్తున్నారు.

ఎన్నిక‌ల ముందు నారా అండ్ నంద‌మూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవి….అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా తీశాడు. అది బెడిసికొట్టింది. ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. మొన్న పవన్ ను టార్గెట్ చేసి ప‌వ‌ర్ స్టార్ అనే సినిమా తీశాడు. అది క్లియ‌ర్ క‌ట్ గా ప‌వ‌న్ మూవీయేన‌ని అంద‌రికీ అర్ధ‌మౌతున్నా…ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది కాద‌ని….నిజ‌జీవితంలో ఒక వ్య‌క్తికి జ‌రిగిన ప‌రిణామాల‌ని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ సినిమా కాదంటూ త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకున్నారు. షార్ట్ ఫిల్మ్‌కు ఎక్కువ సినిమా ఆర్టిస్టుకు త‌క్కువ అయిన న‌టీన‌టుల‌ను తీసుకొచ్చి సినిమా రూపొందించాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మ‌రో వ్య‌క్తిని టార్గెట్ చేశాడు వ‌ర్మ‌. ఆర్జీవి ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న త‌ర్వాత ఫిల్మ్ అత‌ని గురించేన‌ని ట్విట్ట‌ర్ లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఒక ప్ర‌ముఖ హీరో బావ‌మ‌రిది గురించి అని…అత‌ని బావ పొలిటిక‌ల్ పార్టీ పెట్టిన త‌ర్వాత ఏం జ‌రిగింది..ఆ పార్టీలో బావ‌మ‌రిది ఏం చేశాడు అనేది త‌న క‌థాంశంగా ఉంటుంద‌ని చెప్పాడు. ఆ పార్టీ పేరు మ‌న రాజ్యం అని కూడా ట్వీట్ లో ప్ర‌క‌టించాడు. చిరంజీవి పెట్టిన పార్టీ పేరు ప్ర‌జారాజ్యం. అది 2009 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి …..కేంద్ర మంత్రి ప‌ద‌విని పొందారు. అలా ఆ పార్టీ రాష్ట్ర రాజ‌కీయ చ‌క్రం నుంచి క‌నుమ‌రుగైపోయింది. ఇప్పుడు వ‌ర్మ తెర‌కెక్కించ‌బోయేది దాదాపు ఇదే క‌థ అనేది వాద‌న‌. ముఖ్యంగా అల్లుఅర‌వింద్ ను ఈ సినిమాలో….. టార్గెట్ చేయ‌బోతున్నారు. ఎందుకంటే అప్ప‌ట్లో టికెట్ల పంప‌కాల విష‌యంలో అల్లు అర‌వింద్ పై బాగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టికెట్లు అమ్ముకున్నార‌ని కొంద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. దీనిని హైలెట్ చేసే అవ‌కాశం ఉంది. ఇక అల్లుఅర‌వింద్‌ నే టార్గెట్ చేయ‌డానికి కూడా బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. గ‌తంలో శ్రీరెడ్డితో ప‌వ‌న్ ను తిట్టించిన‌ప్పుడు…అల్లు అర‌వింద్ వ‌ర్మ‌పైస తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాడు. అంతేకాదు..ఇటీవ‌ల ప‌ర‌వ్ స్టార్ సినిమా తీసిన‌ప్పుడు కూడా వ‌ర్మ‌ను ఏకి పారేశారు మెగా స్టార్ బావ‌మ‌రిది. అందువ‌ల్లే అల్లు అర‌వింద్‌ను వ‌ర్మ టార్గెట్ చేశార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ సినిమా ఎలా ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిని రేపుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad