Home సినిమా రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా…."

రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా….”

PicsArt 08 03 04.52.16 1

సినిమాల్లో వార‌స‌త్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ముందు తండ్రులు ఆ త‌ర్వాత వారి కుమారులు, కుమార్తెలు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటారు. స‌క్సెస్ అయితే వాళ్ల గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటారు. కాక‌పోయినా కూడా అదే రేంజ్‌లో దెబ్బిపొడుస్తుంటారు. అందుకే త‌మ బిడ్డ‌ల వెండి తెర ఆరంగేట్రం విష‌యంలో……. తార‌లు ఒక‌టిగా ప‌దిసార్లు ఆలోచిస్తారు. అన్నీ స‌క్ర‌మంగా ఉన్నా కూడా మ‌రోసారి మార్పులు, చేర్పుల కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇదే కోవ‌లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి వారసుడు రాంచ‌ర‌ణ్‌. చిరుత‌తో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతోనే రికార్డులు తిర‌గ‌రాశాడు. మ‌గ‌ధీరా సినిమాతో ఇండ‌స్ట్రీలో పాతుకుపోయాడు.

ఇప్పుడు త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి…..కెరీర్ మొద‌లుపెట్టిన చాలా రోజుల వ‌ర‌కూ లుక్స్ ప‌రంగా, న‌ట‌న ప‌రంగా …… ఎన్నో నెగ‌టివ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు రాంచ‌ర‌ణ్‌. త‌న న‌ట‌నాకౌస‌ల్యంతో ఇప్పుడు అవ‌న్నీ మ‌ర్చిపోయేలా చేశాడు. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమా….. ఒక ర‌కంగా దానికి మేజ‌ర్ రీజ‌న్ అని చెప్ప‌వ‌చ్చు. చిట్టిబాబు పాత్ర‌లో మ‌నోడు ఒదిగిపోయిన విధానం అలా ఉంటుంది. చెవిటి క్యారెక్ట‌ర్ లో రాంచ‌ర‌ణ్ న‌ట‌న ఫ్యాన్స్‌తోనే కాదు ప్ర‌తీ వీక్ష‌కుడితోనూ విజిల్స్ కొట్టేలా చేసింది. అన్నిర‌కాల వైవిధ్యాల‌ను ఆ సినిమాలో పండించాడు. అయితే ఆ సినిమా చూసిన త‌ర్వాత చాలా మందికి రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న ఎక్క‌డ నేర్చుకున్నాడు అనే అనుమానం క‌ల‌గ‌వ‌చ్చు.
న‌ట‌నా శిక్ష‌ణ విష‌యానికొస్తే …తెలుగులో ఈ రోజు టాప్ హీరోలుగా ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వాళ్లు వైజాగ్ లో స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్నవారే. అంతేకాదు…చాలా మంది ఇప్పుడున్న యంగ్ స్టార్స్ అంతా కూడా ఆయ‌న ద‌గ్గ‌రే పాఠాలు నేర్చుకున్నారు. చాలా మంది చ‌ర‌ణ్ కూడా అక్క‌డే శిక్ష‌ణ తీసుకున్నాడ‌ని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. చ‌ర‌ణ్ యాక్టింగ్ స్కూల్ బాలీవుడ్ అడ్డా ముంబైలో ఉంది. కిషోర్ న‌మిత్ క‌పూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్ష‌ణ పొందాడు. బాలీవుడ్ సెల‌బ్రెటీ కిడ్స్‌కు ఈ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ఫేమ‌స్‌.


హృతిక్ రోష‌న్ మొద‌లు, క‌రీనా క‌పూర్‌, ప్రియాంకా చోప్రా లాంటి వాళ్లు …… అక్క‌డే న‌ట‌న నేర్చుకున్నారు. తెలుగులో కూడా చాలా మంది న‌టులు కిషోర్ న‌మిత్ క‌పూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్ష‌ణ పొందారు.


అల్లు అర్జున్, ఆర్య‌న్ రాజేశ్, శ‌ర్వానంద్ లాంటి వాళ్లు కూడా……. కిషోర్ న‌మిత క‌పూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో నుంచి వ‌చ్చిన‌వారే. న‌ట‌నా ప‌రిచ‌యం పొంది ఇక్క‌డికొచ్చిన చెర్రీ….టాలీవుడ్ లో హీరోగా నిల‌దొక్కుకున్నాడు. తాను పాఠాలు నేర్చుకున్న ముంబైలోనే జెండా పాతాల‌ని ప్ర‌య‌త్నించాడు. అందుకే జంజీర్ పేరుతో ఒక సినిమా చేశారు. తెలుగులో తుఫాన్ పేరిట రిలీజ్ అయిన ఈ సినిమాలో …..ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించింది. కానీ అది బాలీవుడ్ సినీజ‌నాల‌కు ఏమాత్రం రుచించ‌లేదు. దీంతో ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. మ‌ళ్లీ మ‌రో ప్ర‌య‌త్నం చేయ‌లేదు. టాలీవుడ్ లోనే మంచి క‌థ‌ల‌కు ఒకే చెప్పి…సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.


ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా…. క‌రోనా కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. కరోనా వ‌ల్ల ఈ సినిమా ఎప్ప‌టికి రిలీజ్ అవుతుందో కూడా తెలీని ప‌రిస్థితి నెల‌కొంది. ఏదిఏమైనా ముంబైలో న‌ట‌నా పాఠాలు నేర్చుకుని…టాలీవుడ్ లో తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించే ప‌నిలో చాలా బిజీ అయిపోయాడు మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad