‘చంద్రముఖి’ సినిమాలో జంటగా నటించిన జోడి. ప్రస్తుతము మరో సినిమాతో ఒక్కటి కానుంది. రజినీ, నయనతార సినిమా కాంబినేషన్ లో మరో సినిమా కి తెర తీస్తున్నట్లు కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. పేట సినిమా విజయములో జోరుగా ఉన్న రజనీకాంత్, ‘సర్కార్’ చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన మురుగదాస్. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ప్రేక్షకులను త్వరలో అలరించపోతుంది. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
మురుగదాస్ ముందుగా ఈ సినిమా హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను అనుకున్నట్లు తెలిసింది. కానీ తాజాగా నయనతార పేరు ఖరారు చేసుకున్నాడట. ఈ సినిమా లో రజినీ సరసన నటించడానికి నయనతార ను కలిసాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార ఒక్కరే నటిస్తారా? లేక నయనతార, కీర్తి సురేష్ ఇద్దరు నటించనున్నారా ? రజినీతో జోడి కట్టేదెవరు ? అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ పనులు మాత్రం మర్చి లో ప్రారంభించనున్నారు.