Home సినిమా టాలీవుడ్ న్యూస్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న దుర్గారావు ఎవ‌రో తెలుసా....

యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న దుర్గారావు ఎవ‌రో తెలుసా….

durga rao thumb

నీ ప‌క్క‌న ప‌డ్డాది లేదో చూడులే పిల్ల నాదీ న‌క్లిస్ గొలుసు….. ఈ మ‌ధ్య యమ పాపుల‌ర్ అయ్యింది. యూట్యూబ్ , ఫేస్ బుక్, వాట్సాప్ …వేదికేదైనా…నాది నెక్లెస్ గొలుసు పాటే మార్మోగుతుంది. దానికి కార‌ణం డీ షోలో ఆ పాట ప్ర‌ద‌ర్శించారు. ఈ పాట ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందే దాన్ని ప్రోమోలా వేశారు. ఆ పాట‌కు పండు గ్యాంగ్ వేసిన స్టెప్పులు…..వారితో క‌లిసి మిగిలిన కంటెస్టెంట్లు, టీమ్ లీడ‌ర్లు వేసిన స్టెప్పులు మోత‌మోగాయి. ప్రొమోకే రికార్డు స్థాయిలో లైకులు, షేర్లు వ‌చ్చాయి. దీంతో ఆ పాట పూర్తి ప్ర‌ద‌ర్శ‌న కోసం డ్యాన్స్ ల‌వ‌ర్స్ ఓ రేంజ్ లో ఎదురుచూశారు. అనుకున్న‌ట్టుగానే సూప‌ర్ డూప‌ర్ గా ఆ పాట ప్ర‌దర్శ‌న జ‌రిగింది. అయితే పండు లేడీ గెట‌ప్, డాన్స్ ఒకెత్తైతే…. Who Is దుర్గారావు!? అనే డైలాగ్ దాని త‌ర్వాత పండు చేసిన యాక్టింగ్ మ‌రొకెత్తు.! ఇలా ఈ వీడియో రిలీజైన‌ప్ప‌టి నుండి అస‌లు ఆ దుర్గారావు ఎవ‌రు ? అని తెలుసుకోవాల‌నే కూతూహ‌లం జ‌నాల్లో పెరిగింది. నిజానికి టిక్ టాక్ ఫాలోవ‌ర్స్ కు ఈ దుర్గారావు ప‌రిచ‌య‌స్తుడే. టిక్ టాక్ ను ఫాలో అవ్వ‌ని వారికి….. ఈయ‌న గురించి పెద్ద‌గా తెలిసి ఉండక‌పోవ‌చ్చు.
దుర్గారావుది తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం.

స‌ర‌దాగా త‌న భార్య‌తో క‌లిసి వీడియోస్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేసేవాడు. వాటికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ……అలాగే కంటిన్యూ చేశాడు. అలా దాదాపు టిక్ టాక్ లో దాదాపు 3 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకున్నాడు. దుర్గారావు త‌క్కువ స‌మ‌యంలోనే ఇంత పాపుల‌ర్ అవ్వ‌డానికి కార‌ణాలు కూడా ఉన్నాయి. దుర్గారావు వీడియోస్ ఫ‌న్నీగా, క్రియెటివ్ గా ఉంటాయి. ఆయ‌న భార్య కూడా ఈ వీడియోస్ కి మంచి స‌పోర్ట్ ను ఇస్తుంది. అలానే కొడుకు కూడా స‌హ‌క‌రిస్తుంటాడు. అలా దుర్గారావు చేసిన ఓ వీడియోనే నాది నెక్లెస్ గొలుసు….దాన్నే తీసుకొని పండు ఢీ స్టేజ్ షో మీద కుమ్మేశాడు. త‌న దైన శైలిలో స్టెప్పులు యాడ్ చేసి పాట‌ను పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఇక పాట నేప‌థ్యానికి వ‌స్తే….ఈ సినిమా ప‌లాస 1978 సినిమాలోనిది. సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె దీన్ని కంపోజ్ చేశారు. ర‌క్ష‌త్‌, న‌క్ష‌త్ర, ర‌ఘు కుంచె ప్ర‌ధాన పాత్ర‌ల్లో చేశారు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోయినా…ఓటీటీలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌నే చెప్పాలి. స్వ‌యంగా ర‌ఘు కుంచెనే ఈ పాట పాడారు. ఉత్త‌రాంధ్ర జాన‌ప‌ద పాట‌ను తీసుకుని దాని ప్ర‌త్యేక‌త చెద‌ర‌కుండా విన్న ప్ర‌తిఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యేలా రూపొందించారు ర‌ఘు కుంచె. ఆ సినిమా మొత్తానికి ఈ పాటే హైలెట్ అని చెప్పినా అతిశ‌యోక్తి కాదేమో. అలాంటి పాట‌ను డ్యాన్స్ షోలో తీసుకుని…ప‌క్కా మాస్ స్టెప్పుల‌తో అల‌రించ‌డంతో…ఈ పాట మ‌రింత ఫేమ‌స్ అయ్యింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad