టీవీ కార్యక్రమాలనుండి సినీ దర్శకుడి వరకు ఎదిగిన ఓంకార్ తీసిన మొదటి సినిమా ప్లాప్ అయినా.. ఆ తరువాత 2015 లో విడుదలై హిట్ కొట్టిన హర్రర్ కామెడీ ‘రాజుగారి గది’ లో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా 2017 లో దర్శకుడు ‘రాజు గారి గది2’ ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున , అక్కినేని సమంత నటించి కొంతవరకు హిట్ కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతానికి ఓంకార్ తిరిగి బుల్లితెర మీదే కార్యక్రమాలు చేసుకుంటూనే, ‘రాజు గారి గది 3’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని పాత్రలు, పాత్రధారులు కూడా నిర్ణయించుకొని శరవేగంగా పనులు మొదలు పెట్టాడు. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా మొత్తం లేడీ ఓరియెంటెడ్ గా తమన్న చుట్టూనే కథ సాగుతుందని సమాచారం. అయితే దర్శకులు అక్కినేని నాగార్జునను మాత్రం అలాగే కొనసాగాలవ్వల్ని కోరుకుంటున్నారా. దీనికోసం ఓంకార్ కింగ్ తో సంప్రదింపులు కూడా చేశాడట. ‘రాజు గారి గది-2’ కొంతవరకే హిట్ సాధించడంతో ప్రస్తుతానికి ‘రాజు గారి గది 3 ‘ చేయుటకు ఆసక్తికరంగా లేరని సినీ వర్గాల సమాచారము. మన్మథుడు కాదంటే వెంకీ మామ ను కలిసే ఆలోచనలో దర్శకులు ఓంకార్ ఉన్నారట. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.