Home సినిమా ఘ‌టోత్క‌చుడు సినిమాలోని ఆ చిన్నారి ఎక్క‌డ‌...

ఘ‌టోత్క‌చుడు సినిమాలోని ఆ చిన్నారి ఎక్క‌డ‌…

PicsArt 08 05 06.15.40

కోడి రామకృష్ణ తర్వాత సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో ప్రత్యేకమైన ముద్ర ఏర్ప‌రుచుకున్న ద‌ర్శ‌కుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. నైంటీస్‌లో పుట్టిన వాళ్ల‌కు ఆయన సినిమాలు, పాటలు….. ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఆ రేంజ్ లో సినిమాల‌ను రూపొందించాడు. అలా అని కేవ‌లం సోషియో ఫాంటసీ సినిమాల‌కే ప‌రిమితం కాలేదు. మామూలు సినిమాలు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసి మంచి విజ‌యాల‌ను అందుకున్నారు. ద‌ర్శ‌కుడిగానే కాదు సినిమా నిర్మాణం, సంగీత ద‌ర్శ‌క‌త్వం కూడా చేసేవారు. ఆయ‌న రూపొందించిన ఎన్నో పాట‌లు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా ఉంటాయి. ఎస్ వీ కృష్ణారెడ్డి గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే …… మల్టీ టాలెంటెడ్ అన్న పదం ఆయనకి సరిగ్గా సరిపోతుంది. అలాంటి ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సినిమాల్లో ఒక‌టి ఘ‌టోత్క‌చుడు. ఆ సినిమాకి దర్శకత్వం తో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించారు కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు సినిమా తో ఆయ‌న ఖాతాలో మరొక హిట్ ప‌డింది. అంతేకాదు….. ఆ సినిమాలో నటించిన కైకాల సత్యనారాయణ, అలీ, రోజా, తనికెళ్ల భరణి…… ఇలా ఎంతో మంది నటులకు మంచి పేరు తీసుకొచ్చింది.

ఘటోత్కచుడు సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక పాత్ర చిట్టి. బేబీ నికిత నటన ఆ పాత్రకి జీవం పోసింది. అంత చిన్న వయసులోనే ఎంతో బాగా నటించి అంద‌రితో శ‌భాష్ అనిపించేలా చేసింది.
ఘ‌టోత్క‌చుడు పాత్ర‌లో ఉన్న స‌త్య‌నారాయ‌ణ‌తో అలాగే రాళ్లప‌ల్లి, అలీతో, రోబో తో….ఆ చిన్నారి ప‌లికిన మాట‌లు…ఇప్ప‌టికీ క‌ళ్ల ముందు క‌దిలాడుతూనే ఉంటాయి. ఆ నటన చూసిన చాలామంది నిఖిత …….భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. నిజానికి ఇటీవ‌ల కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు ఏ మాత్రం ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన ….వాళ్లు త‌ర్వాత ప‌లు సినిమాల్లో క‌నిపిస్తున్నారు. అవ‌కాశాలు బాగా వ‌స్తున్నాయి. కాని నిఖిత మాత్రం ఘ‌టోత్క‌చుడు సినిమా త‌ర్వాత క‌నిపించ‌లేదు. చాలా స‌హ‌జంగా న‌టించినా… ఆ చిన్నారికి త‌ర్వాత ఛాన్సులు రాలేదు. బేబి నిఖితను ప‌ట్టించుకోలేదా…లేదంటే కుటుంబ‌స‌భ్యులు సినిమాలు ఎందుకులే అనుకున్నారో ….కార‌ణం తెలియ‌దు కానీ బేబీ నికిత ఇప్ప‌టికీ క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో 8 ఏళ్ల పాప ఇప్పుడు క‌చ్చితంగా 25 ఏళ్లు దాటి ఉంటాయి. స‌రిగ్గా హీరోయిన్ రేంజ్‌కి వ‌చ్చి ఉంటుంది.
అప్పుడే అంత బాగా నటించిన పాప ఇన్ని సంవత్సరాల్లో …… తన నటన ఖచ్చితంగా ఇంకా మెరుగుపడే ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ నిఖిత సినిమాల్లోకి వస్తే …..మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎంతో మంది బాల నటులు…… ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. బహుశా నిఖిత కూడా భవిష్యత్తులో హీరోయిన్ గా….. అందరినీ పలకరిస్తుందేమో చూద్దాం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad