Home టాప్ స్టోరీస్ షూటింగ్స్ ఎప్పటి నుండి మొదలు కానున్నాయి?

షూటింగ్స్ ఎప్పటి నుండి మొదలు కానున్నాయి?

RRR Prabhas20 Pushpa 2020 04 16 12 20 42

కరోనా ప్రభావం దేశం మీద ఎంత ఉందో తెలియదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రం గట్టిగా ఉంది. దేశంలో విజృంభిస్తున్న కరోనాని చూసి భయంతో మన హీరోలు ఇంటికే పరిమితమయ్యారు. మొదట్లో కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేసిన టాలీవుడ్ నిర్మాతలు, ఆ తర్వాత దాన్ని ప్రభావాన్ని చూసి షూటింగులకు సెలవు ఇచ్చేశారు. దేశంలో ప్రతి రోజు దాదాపు 80 వేలకు పైగా కేసులు నమోదు కావడం, భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలు దాటడంతో నిర్మాతలు షూటింగ్ అంటేనే భయంతో వణికిపోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని తెలుస్తోంది.

కరోనాతో కలిసి జీవించడం తప్ప మరో అవకాశం లేకపోవడంతో మూవీ ఇండస్ట్రీ దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటు వస్తుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మరికొన్ని నెలలో మూవీ షూటింగ్స్ మొదలు కానున్నాయి. వచ్చే నెల నుండి మిడ్ మరియు లోబడ్జెట్ మూవీలు చిత్రీకరణ మొదలు కానుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పెద్ద సినిమాలు మాత్రం సెట్స్ మీదకు రావడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య, వకీల్ సాబ్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం లేదు.

తాజాగా అగ్ర దర్శకుల అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఆచార్య చిత్రం నవంబర్ చివర్లో మొదలు కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డిసెంబర్లో మొదలు కానుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఈ ఏడాది మొదలయ్యే అవకాశం లేదు. భారీ తారాగణం అందుకు అనుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అవసరం కావడంతో నిర్మాతలు రిస్కు తీసుకోవాలని అనుకోవడం లేదట. ప్రభాస్ రాధేశ్యామ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సినిమా యూరప్ నేపథ్యంలో తెరకెక్కడంతో అక్కడి వీసా, పర్మిషన్లు ఎప్పుడు లభిస్తే అప్పుడు షూటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెజారిటీ దర్శకులు మాత్రం ఈ ఏడాది సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోతే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad