Home సినిమా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య మిస్ట‌రీ వీడేనా ?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య మిస్ట‌రీ వీడేనా ?

sushant-singh-rajput sucide

బాలీవుడ్ యువ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కేసు మిస్ట‌రీ ఇంకా వీడ‌లేదు. రోజుకో ట్విస్టు తెర‌పైకి వ‌స్తూనే ఉంది.  బాలీవుడ్ మూవీ మాఫియా ఒత్తిడి వల్లే చ‌నిపోయాడ‌నే వాద‌న‌లు బ‌లంగా ఉన్నాయి. త‌న మాజీ గ‌ర్ల‌ఫ్రెండ్స్ అత‌న్ను ఆర్థికంగా మోసం చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో  ఈడీ రంగంలోకి దింది. దీనిపై మ‌నీ లాండ‌రింగ్ కేసు న‌మోదు చేశారు. సుశాంత్ తండ్రి ఇచ్చిన పిర్యాదు మేర‌కు ….ఈడీ ద‌ర్యాప్తు కోసం దిగింది. సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి  సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు తీసుకుంద‌ని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించ‌డంతో…ఈడీ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తోంది.  ఈ విష‌యాల‌పై  వివ‌రాలు అడిగిన ఈడీ…తాజాగా కేసు న‌మోదు చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది. మ‌రోవైపు ఆత్మ‌హ‌త్య వెనుక చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ….. నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే…..గ‌త నాలుగు రోజులుగా సుశాంత్ సింగ్ కుటుంబ‌స‌భ్యులు న‌టి  రియా మ‌ధ్యలో ఈ కేసు ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతుంది.

జూలై 25న సుశాంత్ తండ్రి కేకే సింగ్‌……రియా చ‌క్ర‌వ‌ర్తిపై పాట్నా పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన ప‌ట్నా పోలీసుల‌ బృందం …..29వ తేదీన ముంబై చేరుకుని కేసు విచార‌ణ చేప‌ట్టింది. ఇప్ప‌టికే సుశంత్ మాజీ గ‌ర్ల‌ఫ్రెండ్ అంకిత‌ను విచారించారు.  దీంతో పాటు గ‌ర్ల‌ఫ్రెండ్ రియా ఫ్లాట్ ఫామ్‌ను ప‌రిశీలించింది. అంతేకాదు….. సుశాంత్ అకౌంట్ల‌ల‌ను చెక్ చేశారు అధికారులు.

ఇదిలా ఉంటే……సుశాంత్ తండ్రి కేకే సింగ్ పెట్టిన కేసును ప‌ట్నా నుంచి ముంబైకు బ‌దిలీ చేయాల‌ని న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు..దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. త‌న‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌, దేవుడిపై  న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపింది. కేసు విష‌యంలో త‌న గురించి ఏవేవో చెబుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.  ఈ విష‌యం కోర్టులో ఉన్నందును….. దీని గురించి ఇంత కంటే ఎక్కువుగా మాట్లాడలేన‌ని తెలిపింది.  మ‌రోవైపు రియా చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది. త‌న బాయ్ ప్రెండ్ తాను చెప్పిన‌ట్టు వింటాడ‌ని….అత‌ను గ్యాంగ్ స్ట‌ర్ అయితే తాను ఒక డాన్ అని ఆ వీడియోలో చెబుతోంది.  ఈ వీడియో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఇది ఇఎప్పుడు తీశారు…ఎలాంటి ప‌రిస్థితుల్లో తీశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.  రియా స్నేహితుల మాత్రం అది ఒక స్టాండ‌ప్ కామెడీ కోసం తీసిన వీడియో అని చెబుతున్నారు.

మ‌రోవైవు బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు ఖాతాల‌ను  సోదాలు చేశారు. న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి ఇంటిలో త‌నిఖీలు చేశారు.  సుశాంత్ ఖాతా నుంచి రియా ఖాతాకు పెద్ద‌గా న‌గ‌దు బ‌దిలీ జ‌ర‌గ‌లేద‌ని గుర్తించారు.

సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు చెబుతున్న అంత న‌గ‌దు…..అత‌ని  అకౌంట్ల‌లో లేవ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే….అటు ముంబై పోలీసుల‌కు, పాట్న పోలీసుల‌కు…. అస‌లు పొస‌గ‌డం లేదు. ఒకే కేసుపై రెండు రాష్ట్రాల పోలీసులు విచారిస్తుండ‌టంతో ఏం జ‌రుగుతుంది అనేది అంతు ప‌ట్ట‌డం లేదు.  ముంబై పోలీసులు …..త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప‌ట్నా పోలీసులు ఆరోపించ‌డం మ‌రికొన్ని అనుమానాల‌కు తావునిస్తోంది.  దీనిపై బీహార్ మంత్రి సుశీల్ మోదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం బీఎండ‌బ్ల్యూ, జాక్వ‌ర్ కారు విష‌యంలో…. బీహార్ పోలీసులు ప‌లు ర‌కాలు అనుమానాలను  వ్య‌క్తం చేస్తున్నారు. 

జూలై 29వ తేదీన అంకిత ఇంటికి ఆటోల వ‌చ్చిన పోలీసుల…గంట సేపు విచార‌ణ త‌ర్వాత  జాక్వ‌ర్ కారులో వెళ్లారు.  సుశాంత్ బీఎండ‌బ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. మ‌రోవైపు సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని….. ఇప్ప‌టికే బీజేపీ అగ్ర‌నేత సుబ్ర‌హ్మాణ్య‌స్వామి డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ మాత్రం సుశాంత్ చావుకు కార‌ణ‌మైన ఏ ఒక్క‌ర్నీ వ‌ద‌ల‌ద్ద‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. ఇలా ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతోంది సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad