Home సినిమా టాలీవుడ్ న్యూస్ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

rajini

సినిమా రంగంలో సూపర్‌స్టార్స్‌గా ఉన్న వారికి ఎలాంటి మర్యాదలను అందుకుంటార అందరికీ తెలిసిందే. ఇక తెలుగు హీరోల్లో స్టార్ స్టేటస్ కలిగిన వారిని ఏకంగా దేవుడిలా భావిస్తుంటారు ఇక్కడి ప్రేక్షకులు. సినిమాల్లో మొత్తం తమ అభిమాన హీరోలను పొగిడే సీన్స్, వారిని హైలైట్ చేస్తూ ఉండే పాటలు ఉంటేనే ఆ సినిమాలకు ఓటేస్తారు ప్రేక్షకులు. అయితే ఇదంతా ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమాలో సత్తా లేకపోతే స్టార్ హీరో సినిమా అయినా తిప్పికొడుతున్నారు.

అయితే కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరో ఒకానొక సమయంలో ఓ హీరోయిన్ కాళ్లు పట్టుకోవడంతో ఒక్కాసారిగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి లోనైన సంఘటన చాలా తక్కువ మందికి తెలుసు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కాగా 1989లో వచ్చిన శివ అనే సినిమాలో రజినీకాంత్ ఓ సన్నివేశంలో హీరోయిన్ శోభన కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సీన్ చేసేందుకు రజినీ అభ్యంతరం చెప్పాడు.

రజినీకాంత్ ఇలా ఎందుకు అభ్యంతరం చెప్పాడా అని అందరూ అనుకున్నారట. కానీ దర్శకనిర్మాతల బలవంతంపై రజినీకాంత్ ఆ సీన్‌ను పూర్తి చేశాడు. కట్ చేస్తే, సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ ఒక్క సీన్ చాలా వివాదానికి తెరతీసింది. రజినీకాంత్ ఫ్యాన్స్ శోభనతో పాటు సదరు చిత్ర యూనిట్‌పై నిప్పులు చెరిగారు. ఫ్యాన్స్ నుండి ఇంత తీవ్రతను ఎదుర్కొవాల్సి వస్తుందని తాము అనుకోలేదని ఆ చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం. ఇక ఆ తరువాత శోభన రజినీ సరసన దళపతి, కొచ్చాయిడన్ వంటి చిత్రాల్లో నటించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad