అక్కినేని నట వారసుడు అఖిల్ చిన్నప్పుడే భారీ హిట్ సాధించాడు. ఇప్పుడు మాత్రం తీసిన ప్రతి సినిమా నిరాశ పరుస్తుంది. మొదటి సినిమా అఖిల్ అందరిని నిరాశపరిచింది. కానీ, ఆ సినిమా రిలీజ్ కు ముందు దాదాపు నలబై కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఆ రేంజ్ లో అప్పట్లో అఖిల్ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, మొదటి సినిమా దాదాపు ముప్పది కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. అంతే ఇక ఆ సినిమా నిర్మాత ఇప్పటికీ కోలుకోలేదు.
ఇక రెండో సినిమా హలో విడుదలకు ముందు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కానీ, వసూళ్లలో మాత్రం పద్దెనిమిది కోట్ల రూపాయల లాభం మాత్రమే రావడంతో, పది కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. దీంతో హలో కూడా అటు ప్రేక్షకులను, ఇటు దర్శకనిర్మాతలను నిరాశపరిచింది. ఇక అఖిల్ అక్కినేని మూడో సినిమాగా మిస్టర్ మజ్నులో నటించాడు. ఈ సినిమాను ఇరవై కోట్ల రూపాయల తో తీశారు. ఈ సినిమా కేవలం పన్నెండు కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టగలిగింది. అంటే దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.
ఇలా మొదటి సినిమా నుంచి మూడో సినిమా వరకు అఖిల గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. దాంతో అఖిల్ కి ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలో అర్ధం కావడం లేదట. నాలుగో సినిమా విషయంలోనూ పూర్తిగా డైలమాలో పడిపోయాడు మన సిసింద్రీ. అన్ని నష్టాలే జరగడంతో ఇక నాగార్జునే స్వయంగా మంచి కథతో కూడిన సినిమా వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సారి కథ మాత్రం కుటుంబము అంతా విన్నాకే ఓకే చెప్తారట. అఖిల్ కెరీర్ పై కుటుంబం చాలా శ్రద్ద తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని ప్రకారం చూస్తే అఖిల్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టేలా ఉందన్నమాట.