
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం బాహుబలి. ఆ సినిమా అందించిన ఇమేజ్‌తో తన కెరీర్‌ను పక్కాగా సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే ఘాజీ లాంటి చిత్రంతో యావత్ భారతదేశ ప్రేక్షకులను మెప్పించిన రానా, తాజాగా ‘అరణ్య’ అనే సినిమాతో రానున్నాడు. అడవి బ్యా్క్‌డ్రాప్‌లో వస్తు్న్న ఈ సినిమాలో ఏనుగులతో స్నేహం చేసే వ్యక్తిగా రానా కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు మరో హీరో రెడీ అవుతున్నాడు.
రానా లాగానే అడవి బ్యాక్‌డ్రాప్ చిత్రంతో వచ్చేందుకు తమిళ హీరో విశాల్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కూడా జంతువులతో హీరో స్నేహం చేయడం లాంటి కథ ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజానికి రానా చేస్తున్న సినిమాను స్పూర్తిగా తీసుకునే ఈ సినిమా కథను రెడీ చేశారని, సినిమా కంటెంట్ విశాల్‌కు బాగా నచ్చేయడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే అనేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు విశాల్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విశాల్ నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులో వదులుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అడవి బ్యాక్‌డ్రాప్‌లో రాబోయే సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా విశాల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.