Home సినిమా విన‌య‌ విధేయ రామ‌లో 11 హైలెట్స్ ఇవే..!

విన‌య‌ విధేయ రామ‌లో 11 హైలెట్స్ ఇవే..!

మెగా అభిమానులంతా ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూసిన వినయ విధేయ రామ చిత్రం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. త‌న అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర‌, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ చిత్రంలోని హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం…

 • రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన తొలి మూవీ విన‌య విధేయ రామ‌.
 • ఇప్ప‌టి వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, ర‌వితే, వెంక‌టేశ్‌, అల్లు అర్జున్ వంటి హీరోల‌తో ప‌క్కా మాస్ సినిమాల‌ను తెర‌కెక్కించిన బోయ‌పాటి శ్రీ‌ను తాజాగా రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కించి ప‌క్కా యాక్ష‌న్ డ్రామా వినయ విధేయ రామ‌
 • రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఇంటి పేరును ఏ సినిమాలోనూ వాడుకోలేదు. ఈ సినిమాలో రామ్ కొణిదెల అనే పేరును పెట్టుకున్నాడు.
 • రామ్ చ‌ర‌ణ్‌ ఇప్ప‌టి వ‌ర‌కు రాంబోలా కండ‌లు పెంచ‌లేదు. ఈ సినిమాలో కండ‌లు పెంచాడు.
  ప‌క్కా రాంబో లుక్ తెచ్చుకున్నాడు. విల‌న్‌ల ముందు విధ్వంసం చేసే రాముడిలా కనిపించేందుకు అలా రాంబోలా కండ‌లు పెంచాడు రామ్ చ‌ర‌ణ్‌
 • భ‌ద్ర సినిమా నుంచి మొన్న‌టి జ‌య జాన‌కి సినిమా వ‌ర‌కు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప‌క్కా మాస్ సినిమాల‌ను తీసుకుంటూ వ‌స్తున్నాడు. అంద‌మైన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి చెందిన హీరోకు, విల‌న్‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌. బోయ‌పాటి సినిమాల్లో దాదాపు ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే యాంగిల్ క‌నిపించింది.
 • ఈ సినిమా ఎక్కువ‌గా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌పైనే ఫోక‌స్ పెట్టింద‌ని రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే.
 • ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ న‌టించాడు.
 • వివేక్ ఒబెరాయ్ తెలుగులో విల‌న్‌గా న‌టించిన తొలి తెలుగు మూవీ ఇది.
 • త‌మిళ్ హీరో ప్ర‌శాంత్ చ‌ర‌ణ్‌కు అన్న‌య్య‌గా న‌టించాడు
 • భ‌ర‌త్ అనే నేను ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా న‌టించింది
 • దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

రంగ‌స్థ‌లం వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత చ‌ర‌ణ్ న‌టించిన మూవీ ఇది. పైగా సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో విన‌య విధేయ రామ‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

చ‌ర‌ణ్ మ‌రో భారీ విజ‌యాన్ని ఇస్తాడా..? బోయ‌పాటి చ‌ర‌ణ్‌తో కూడా విజ‌యాన్ని అందుకుంటాడా.? అనేది ఈ రోజు గ‌డిస్తేగాని చెప్ప‌లేమ‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad