Home సినిమా 'బిగ్ బాస్3' షోకి రౌడీ రాబోతున్నాడు..!

‘బిగ్ బాస్3’ షోకి రౌడీ రాబోతున్నాడు..!

తెలుగు వారికి అత్యంత దగ్గరైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఫస్ట్ సీజన్ లో ఎన్టీయార్, సెకండ్ సీజన్ లో నాని లు అదరగొట్టారు…ఫస్ట్ సీజన్ హిట్ అయినంత రేంజ్ లో నాని హోస్ట్ గా చేసిన సెకండ్ సీజన్ అంతగా హిట్ టాక్ ను సంపాదించుకోలేక పోయింది. ముఖ్యంగా నాని ఆకట్టుకోకపోవడం అందరినీ కాస్త నిరాశకు గురి చేసింది. కానీ బిగ్ బాస్ షోకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాదాపు అన్నీ భాషల ఇండస్ట్రీ ల్లో ఈ షో మొదలయ్యి నాలుగైదు సీజన్లు కంప్లీట్ చేసుకున్నాయి.

ఇక తెలుగు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మూడో సీజన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉన్నా, హోస్ట్ ఎవరనేది ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది.. ఆ మధ్య చిరంజీవిని సంప్రదిస్తున్నామని, నాగార్జునని చూస్తున్నామని ఇలా రకరకాల వార్తలు షికార్లు చేశాయి. ఇపుడు మరో కొత్త వార్త తెర మీదకు వచ్చింది. ఇపుడు హీరో విజయ్ దేవరకొండ పేరు ప్రచారంలో ఉంది. బిగ్ బాస్3 సీజన్ కోసం విజయ్ ని సంప్రదించారట. ఇపుడిపుడే సరికొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్న విజయ్ ఈ ఆఫర్ ఒప్పుకున్నాడో, లేదో తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్ రావాల్సిందే. అయితే ప్రస్తుతం గీతా గోవిందం సినిమా తరువాత వచ్చిన రెండు సినిమాలు అంతగా ఆడలేదు ఇంకొకటి రిలీజ్ కి రెడీగా ఉంది.

ఈ సమయం లో విజయ్ ఫేమ్ అలాగే నిలబడి ఉండాలంటే ఈ ఆఫర్ ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటే ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతాడు… ఒకవిధంగా అటు రెమ్యూనరేషన్ కూడా సినిమా కంటే పెద్దగానే ఆఫర్ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్తితులో విజయ్ ఈ ప్రాజెక్ట్ చేయడం తన కెరీర్ కి ప్లస్ అవుతుంది అనేది సినీ విమర్శకుల మాట.

యూత్ ఫాలోయింగ్ ఉన్నవాడు కాబట్టి విజయ్ బాగా సూట్ అవుతాడు. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో మాస్ యాటిట్యూడ్ తో అందరిని అట్రాక్ట్ చేయగలడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad