‘ఒక మనసు’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి మెగా ఫ్యామిలీ నుంచి అరంగేట్రం చేసింది మెగా డాటర్ నిహారిక. ఆ తరువాత ‘హ్యాపీ వెడ్డింగ్’ తో మరో సారి ట్రై చేసిన అంతగా మెప్పించలేక పోయింది. మరో పక్క ‘ఓరు నల్ల నాల్ పాతు సోలెర్న్’ సినిమాతో తమిళంలో అడుగిడింది. ‘ముద్దపప్పు ఆవకాయ’, ‘నాన్న కూచి’ అంటూ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నము చేసింది. ప్రస్తుతానికి ‘సూర్యకాంతం’ అంటూ మెగా అభిమానులను అలరించేందుకు సిద్దమవుతుంది.
‘సూర్యకాంతం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. టీజర్ తో తెగ అల్లరి చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేసింది అమ్మడు.. మార్చి 29న విడుదలకు సినిమా సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ వేగం పెంచేశారు చిత్ర యూనిట్ వారు. ఆ మధ్య ఈ సినిమా నుండి లిరికల్ వీడియో సాంగ్ ను నాగచైతన్య చేతులతో విడుదల చేపించారు. తాజాగా యూత్ ని ఆకట్టుకునే దిశగా ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా రౌడీ రాబోతున్నాడు.
హైదరాబాద్ లోని జెఆర్సి కన్వెన్షన్‌లో ఈరోజు సాయంత్రం6 గంటలకు జరగబోవు వేడుకలో ‘సూర్యకాంతం’ టీం తో కలసి సందడి చేసేందుకు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ పతాకం ఫై ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిహారికతో జోడీగా స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. నిహారిక సైరా సినిమాలో కూడా కనిపించనున్నట్లు సమాచారం.