
టాలీవుడ్లో కామెడీ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ జోనర్లో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన దాఖలాలు ఉన్నాయి. కాగా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 చిత్రం కూడా ఈ కోవలోకే చెందింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను కట్టబెట్టారో అందరికీ తెలిసింద. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సెస్ అయ్యింది.
ఇక భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పటినుండో చెబుతూ వస్తున్నాడు. కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని అనిల్ రావిపూడి చెబుతూ వస్తున్నాడు. కాగా ఈ సినిమాలో మళ్లీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటించేందుకు ఒప్పుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. కాగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొదలవుతుండటంతో ఎఫ్ 3 చిత్రాన్ని అతి త్వరలో ప్రారంభించేందుకు విక్టరీ వెంకటేష్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
అయితే వెంకటేష్ నటిస్తున్న నారప్ప, వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సార్ చిత్రాల షూటింగ్ ముగియగానే ఎఫ్3లో జాయన్ అయ్యేందుకు వారు రెడీగా ఉన్నట్లు తెలిపారు. మరి ఎఫ్3 చిత్రం ఈ ఏడాదిలో పట్టాలెక్కుతుందో లేదో అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఏదేమైనా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న ఎఫ్2 సీక్వెల్ చిత్రంపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవ్వడం విశేషం.