Home సినిమా గాసిప్స్ మెగా ప్రిన్స్ అలాంటి పాత్రలో నటిస్తాడా?

మెగా ప్రిన్స్ అలాంటి పాత్రలో నటిస్తాడా?

Varun Tej To Do Cop Role

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాక్సర్’ ఇప్పటికే స్టార్ట్ అయ్యేది ఉండే. కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుపెట్టకముందే తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేశాడు ఈ హీరో. దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు వరుణ్ తేజ్ ఓకే చేశాడు.

అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎప్పుడూ చేయని పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తాడని, ఈ సినిమాకు ఆయన పాత్ర చాలా హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సాగర్ చంద్ర, ఇప్పుడు మరోసారి అదిరిపోయే కాప్ డ్రామా కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తి మేకోవర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో గద్దలకొండ గణేష్ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎలా మారిపోయాడో మనకు తెలిసిందే. ఇప్పుడు బాక్సర్ చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్ ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీపై అప్పుడే మెగా ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక ఎఫ్2 చిత్ర సీక్వెల్ ‘ఎఫ్3’లో కూడా వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. మరి ఈ సినిమాలను వరుణ్ తేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad