Home టాప్ స్టోరీస్ కన్ఫ్యూజన్ లో వరుణ్ తేజ్..“బాక్స‌ర్” పరిస్థితి ఏంటి ?

కన్ఫ్యూజన్ లో వరుణ్ తేజ్..“బాక్స‌ర్” పరిస్థితి ఏంటి ?

varun tej konidela brand ambassador for nagarjuna cement

మెగా ఫ్యామిలీలో యువ హీరో వరుణ్ తేజ్ కి ప్రత్యేకస్థానం ఉంది. చిరంజీవి వలే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు వరుణ్. తొలి ప్రేమ, ఫిదా వంటి సినిమాలతో తన సక్సెస్ గ్రాఫ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. అంతరిక్షం సినిమాతో కొత్త ప్రయత్నం చేసినప్పటికీ అది పూర్తి సక్సెస్ కాలేకపోయింది. తరువాత ఎఫ్2, గద్దల కొండ గణేష్ సినిమాలుతో వసూళ్ల సునామీ సృష్టించాడు. కమర్షియల్ సినిమాలు భారీ వసూళ్లు తెచ్చినప్పటికీ ప్రయోగాత్మక చిత్రాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఈ సమయంలోనే బాక్సర్ అనే ఓ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాకు  సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తుంది.

వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చి నుంచి మొదలుకావాల్సి ఉంది. మూవీలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తుండటంతో ఇప్పటికే బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ హఠాత్తుగా ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లు రాకుండా నిలిచిపోయాయి. బాక్సర్ సినిమా నిలిచిపోయిందని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత ఆర్థికంగా నష్టపోవడంతో సినిమా నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన దర్శకుడు సాగర్ అవి అబద్దాలని కొట్టి పారేశాడు. కానీ రూమ్స్ మాత్రం ఆగలేదు.

దీనికి ప్రధాన కారణం హీరో వరుణ్ తేజ్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్  ఈ సినిమాని పక్కన పెట్టి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు  ఓ క‌మ‌ర్షీయ‌ల్ పోలీస్ ఎంట‌ర్ టైన‌ర్ స్టోరీని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అందుకే బాక్సర్ నిలిచిపోయిందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాలంటే బాక్స‌ర్ విష‌యం గురించి అప్ డేట్ రావాల్సిందే మరి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad