వివాదాస్పద దర్శకుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘ చిత్రాన్ని విడుదలకు ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రేక్షకుల ముందుకు తీసుక రావాలని గట్టి నిర్ణయమే తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతుందన్న ఆర్జీవీ సెన్సార్ బోర్డు తో వచ్చిన విబేధాల వలన రీ స్క్రీనింగ్ కి సమయం పడుతుందని ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడి మీదే ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
వర్మ ట్వీట్ కి వెళ్తే..
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని పూర్తిగా నెగటివ్ షేడ్స్ లో చూపించాడు వర్మ. ఎలక్షన్ సమయాన సినిమా విడుదల జరిగితే ఓటర్ల ఫై ప్రభావం చూపుతుందని భావించిన టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘంకి తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి పిర్యాదు చేసారు. టీడీపీ నేతలు చివరకు కోర్ట్ మెట్లు కూడా ఎక్కారు, కానీ కోర్టు కాస్త ఈ కేసు కొట్టేసింది. సెన్సార్ బోర్డ్ నుంచి కూడా అడ్డంకులు తొలగి పోయాయి. దీంతో మిగిలిన కొన్ని వర్గాల నుంచి సినిమా అడ్డుకునే ప్రయత్నము జరుగుతుందని ముందుగానే పసి గట్టిన వర్మ చంద్రబాబుని భలే ఇరకాటంలో పెట్టాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఫై వర్మ ట్విట్టర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని కొంతమంది ఆపుటకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా చంద్రబాబు నాయుడు హయాంలో అలాంటివి ఆస్కారం ఉండదంటూ.. ఆయనే దగ్గరుండి మరి సినిమా విడుదలయ్యేలా చూస్తారు’. చివరలో జై నారా చంద్రబాబు నాయుడు… జై ఎన్టీఆర్ అంటూ తనదైన శైలిలో వర్మ బాబును ట్వీట్ లో ఇరికించాడు. ఈ విదంగా చంద్రబాబు.. వర్మ చేసిన ట్వీట్ కి సినిమాను ఆపే ప్రయత్నం చేస్తే, సీఎం గా బ్యాడ్ నేమ్ తప్పదు. అటు ఆపకపోయిన బ్యాడ్ నేమ్ తప్పదు. వర్మ ఇచ్చిన కౌంటర్ కి ఇక చంద్రబాబు ఏమి చేయనున్నాడో వేచి చూడాలి.