Home సినిమా లాస్ ఏంజిల్స్ లో వాల్మీకి..!

లాస్ ఏంజిల్స్ లో వాల్మీకి..!

ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి సందర్బంగా విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమా వరుణ్ తేజ్ కి సక్సెస్ ను ఇచ్చింది. ఆయన తదుపరి రాబోయే సినిమా హరీశ్ శంకర్ తో ఖరారైంది. అయితే అది డైరెక్ట్ గా తెలుగులో వచ్చే సినిమా కాదు. తమిళంలో కొంతకాలం క్రితం సిద్ధార్థ్ నటించిన ‘జిగర్తాండ’ ను రీమేక్ చేయాలనుకుంటున్నారు శంకర్. సిద్దార్థ్ నటించిన ఈ సినిమా అక్కడ తమిళ ప్రేక్షకులను బాగా అలరించింది దీంతో భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా తీసి క్యాష్ చేసుకోవాలనుకుని రంగంలోకి దిగాడు హరీష్ శంకర్.

తమిళంలో ‘జిగర్తాండ’ కాగా, దీనికి తెలుగు లో ‘వాల్మీకి’ అనే పేరు ఖరారు చేసుకున్నారు. ఇక ఈ సినిమా కథానాయకుడుగా ముందుగా సిద్దార్థ్ అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో సిద్దార్థ్ కి షెడ్యూల్ కుదరక పోవడంతో, వరుణ్ తేజ్ అయితే పర్ఫెక్ట్ అని ఎంపిక చేసుకున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాలోవరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించపోనున్నాడు. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకోవడం కోసం లాస్ ఏంజిల్స్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ బాక్సింగ్ నేర్చుకున్నాక తిరిగి వచ్చి షూటింగ్ చేయనున్నాడు. వరుణ్ తేజ్ కి జంటగా ఈషా రెబ్బా పేరు తెర మీదకు వచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad