Home టాప్ స్టోరీస్ సత్యమేవ జయతే అంటూ దూసుకొచ్చిన వకీల్ సాబ్

సత్యమేవ జయతే అంటూ దూసుకొచ్చిన వకీల్ సాబ్

Vakeel Saab Motion Poster On Pawan Kalyan Birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి మరో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో పవన్ ఓ చేతిలో కర్ర పట్టుకుని మరో చేతిలో లా పుస్తకాన్ని పట్టుకుని చాలా అగ్రెసివ్ లుక్‌లో కనిపించాడు. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే వకీల్ సాబ్ అవతారంలో పవన్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక ఈ పోస్టర్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పవన్ బర్త్‌డే కానుకగా వచ్చిన ఈ మోషన్ పోస్టర్ లుక్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కును ఇచ్చిందని చెప్పాలి.

వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నివేధా థామస్, అంజలి, అనన్యా నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సె్స్ అయిన పింక్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి వకీల్ సాబ్ చిత్రంతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad