Home సినిమా తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండోది రెడీ చేస్తున్న మెగా హీరో

తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండోది రెడీ చేస్తున్న మెగా హీరో

uppena thumb

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖచ్చితంగా హిట్ కొడతాడని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా పాటలు ప్రేక్షకులను బీభత్సంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు టాప్ చార్ట్ బస్టర్స్‌లో జెండా ఎగరేస్తూ దూసుకుపోతున్నాయి.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలిజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ప్రస్తుతం సినిమా థియేటర్లు మూతపడి ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసేందుకు వైష్ణవ్ తేజ్ రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ కథను కూడా ఓకే చేశాడట ఈ హీరో. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు, సినిమాలో నటీనటులు ఎవరు అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఉప్పెన చిత్రం ఇప్పటికే మ్యూజికల్ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సూపర్ హిట్‌గా నిలుస్తుందని భావించిన హీరో, ఇలా తన రెండో సినిమాకు పచ్చ జెండా ఊపడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తొలి సినిమా ఫలితం రాకముందే రెండో సినిమా ఓకే చేయడం కేవలం అవివేకం అంటున్నారు సినీ క్రిటిక్స్. మరి ఈ మెగా హీరోకు తొలి సినిమా ఎలాంటి ఫలితాన్ని మిగిలిస్తుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad