Home సినిమా టాలీవుడ్ న్యూస్ బన్నీ బాటలో మరో మెగా హీరో!

బన్నీ బాటలో మరో మెగా హీరో!

Vaishnav Tej Krish Movie Backdrop

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు వైష్ణవ్ తేజ్ రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా ఈ సినిమాను అడవి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించేందుకు క్రిష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే తరహా బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కి్స్తున్న పుష్ప చిత్రంపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా ఇదే తరహా బ్యాక్‌డ్రాప్ కథతో వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తెరకెక్కించి కేవలం ఒకేఒక్క షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad