Home సినిమా టాలీవుడ్ న్యూస్ అనుష్కను ఆలోచనలో పడేసిన నాని

అనుష్కను ఆలోచనలో పడేసిన నాని

V Release Puts Nishabdham In Pressure

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘వి’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్ల వరకు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మార్చి 31న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఉన్న నాని ‘వి’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో, చాలా తక్కువ అంచనాలు ఉన్న అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనుష్క లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను కూడా వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నించింది. కానీ లాక్‌డౌన్ కారణంగా అది కుదర్లేదు. అప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికైనా ఓటీటీలో రిలీజ్ అయితే మంచి వ్యూవర్‌షిప్ వస్తుందని, మరింత ఆలస్యం అయితే అసలుకే మోసం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో అనుష్క అండ్ టీమ్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి సైలెంట్‌గా నిశ్శబ్దం చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad