Home టాప్ స్టోరీస్ రికార్డులు సృష్టిస్తున్న‘టక్ జగదీష్’

రికార్డులు సృష్టిస్తున్న‘టక్ జగదీష్’

jpg 1 4

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నాని నటించిన “వి” సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ దాదాపు 37 కోట్లు చెల్లించి౦దని ప్రచారం సాగుతోంది. వరుస విజయాలు మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో నాని  సినిమాలకు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘టక్ జగదీష్’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పార్ట్నర్ అయిన లక్ష్మణ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవరిస్తున్నారు.

కాగా లక్ష్మణ్ ‘టక్ జగదీష్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 22కోట్లకు కొనుగోలు చేసాడట. కరోనా  కారణంగా థియేటర్లు తెరుచుకోన్నప్పటికి లక్ష్మణ్ ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి  శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కలయికలో ఇప్పటికే నిన్నుకోరి వంటి బ్లాక్ బస్టర్ ఏ సినిమా వచ్చింది. 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ‘టక్ జగదీష్’ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాని టాక్సీవాలా దర్శకుడుతో శ్యాము సింగరాయ్ అనే హిస్టారికల్ సినిమాలో నటించనున్నారు. థియేటర్ల పై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నాని క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. అటు ఓటీటీ లోనూ ఇటు థియేటర్లను నాని రాఫ్ఫాడిస్తున్నాడు. నాని వి సినిమాను మొదట్లో థియేటర్లో విడుదల శాతం అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక నిర్మాత దిల్ రాజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. జనవరి నాటికి కూడా కరోనా ఉధృతి తగ్గకపోతే ‘టక్ జగదీష్’ కూడా ఓటీటీ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.    

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad