టీఎస్ఆర్, టీవీ9 కలిసి ఇప్పటికి ఐదు సార్లు జాతీయ చలన చిత్ర అవార్డుల పంపిణి వీరు నిర్వహించారు. హైదరాబాద్లో మూడు సార్లు, విశాఖపట్నం లో ఒక్కసారి జరిగింది.ఇప్పుడు మరల విశాఖపట్నం లో ఫిబ్రవరి 17న అట్టహాసంగా వేడుకలు జరుగనున్నాయి. జ్యూరీ సభ్యులు నగ్మా,డా. శోభన కామినేని, రఘురామకృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్ పాల్గొన్నారు. ఈ అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేకతను చూస్తే ఇది ప్రభిప్రాయ సేకరణ అని మాట్లాడారు కమిటీ చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి. విశాఖపట్నం లో జరగబోయే ఈ కార్యక్రమములో 2017, 2018 సంవత్సరాలకు అవార్డు విజేతలను చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.
2018 ని గాను మహనటి చిత్రం ఆరు అవార్డ్స్ ని సొంతం చేసుకోగా, అదే విదంగా రంగస్థలం నాలుగు అవార్డ్స్ ని కైవసం చేసుకుంది. 2017 సంవత్సరముకు గాను గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం , ఖైదీ నంబర్ 150 మూడు అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి .
2018 మహానటి చిత్రం నుండి ఆరు అవార్డ్స్:
ఉత్తమ చిత్రం అవార్డు: మహానటి
ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : రాజేంద్రప్రసాద్
ఉత్తమ నటి : కీర్తి సురేష్
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : సాయి తేజస్విని
ఉత్తమ గాయకుడు : అనురాగ కులకర్ణి
2018 రంగస్థలం చిత్రం నుండి నాలుగు అవార్డ్స్ :
ఉత్తమ ప్రముఖ చిత్రం అవార్డు: రంగస్థలం
ఉత్తమ కథానాయకుడు: రామ్ చరణ్
ఉత్తమ ప్రముఖ దర్శకుడు: సుకుమార్
ఉత్తమ గాయిని: ఘంటా వెంకట లక్ష్మి
2018 అరవింద సమేత వీర రాఘవ చిత్రం నుండి మూడు అవార్డ్స్ :
ఉత్తమ కథానాయిక: పూజా హెగ్డే
ఉత్తమ సంగీత దర్శకుడు: థమన్
ఉత్తమ గాయకుడు: మోహన భోగరాజు
2017 గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం నుండి మూడు అవార్డ్స్:
ఉత్తమ చిత్రం అవార్డు: గౌతమి పుత్ర శాతకర్ణి
ఉత్తమ కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ
ఉత్తమ దర్శకుడు: క్రిష్
2017 ఖైదీ నంబర్ 150 చిత్రం నుండి మూడు అవార్డ్స్:
ఉత్తమ ప్రముఖ చిత్రం అవార్డు : ఖైదీ నంబర్ 150
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
ఉత్తమ ప్రముఖ దర్శకుడు: వి.వి వినాయక్