Home సినిమా తారక్ కోసం టైటిల్ మారుస్తున్న మాంత్రికుడు

తారక్ కోసం టైటిల్ మారుస్తున్న మాంత్రికుడు

trintr2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో పాటు మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు. అటు త్రివిక్రమ్ బన్నీతో కలిసి అల వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత ఈ సినిమా చేస్తుండటంతో, ఈసారి తారక్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోండటంతో, పాన్ ఇండియా లెవెల్‌లో టైటిల్ కూడా ఉండాల్సి ఉంది. దీంతో ఈ సినిమాకు అచ్చతెలుగు టైటిల్ అయితే సరిపోదని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

ఈ క్రమంలోనే తారక్-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్‌ను మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే తారక్‌తో ‘అరవింద సమేత’ అనే సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తారక్‌తో మాటల మాంత్రికుడు ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా, ఈ సినిమా నిజంగా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి మాటల మాంత్రికుడు ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad